చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం లో మంగళవారం రోజు విమానం యొక్క టాయిలెట్లో దొంగతనంగా దాచి ఉంచిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు .దాదాపు ఈ బంగారం విలువ 2.24 కోట్లు విలువ చేస్తుంది అని కస్టమ్స్ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ నుంచి భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు.


వివరాల్లోకి వెళితే.. దుబాయ్‌ నుంచి భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు అధికారులు ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు.స్మగ్లర్లు బంగారం తరలింపును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కస్టం అధికారుల కళ్లు కప్పేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. స్కానర్లు, సెన్సార్లు, మెటల్ డిటెక్టర్లకే కాకుండా మహా మేధావులకు ఊహకందని పద్దతుల్లో సక్సెస్‌ఫుల్‌గా స్మగ్లింగ్ దందాను అనుసరిస్తున్నారు. 


కస్టమ్స్ నిబంధనల ప్రకారం గోల్డ్ తరలించాలంటే కేజీకి రూ.2.50లక్షలు చెల్లించాలి. ఈ సుంకం మొత్తాన్ని ఎగ్గొట్టడానికి స్మగ్లర్లు కొంగొత్త ఎత్తులు వేస్తున్నారు. స్మగ్లర్లు ఎప్పటికప్పుడు అనుసరిస్తున్న కొత్త పద్దతులు సీనియర్ కస్టమ్స్ అధికారుల అనుభవాన్ని కూడా సవాల్ చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో భారీగా కస్టమ్స్ అధికారులు నిఘా పెట్టడంతో బంగారం స్మగ్లర్లు పాత పద్దతులకు స్వస్తి చెప్పి కొత్త విధానాల్లో దూసుకుపోతున్నారు. అయినా కొందరు కస్టమ్స్‌కు చిక్కుతున్నారు. అయితే వారు బంగారం తరలించే పద్దతులు అధికారులను కూడా నివ్వెరపోయేలా చేస్తున్నాయి. 


ఇండియా విమానంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విమానం వెనక భాగంలోని టాయిలెట్‌లో నలుపు రంగులో నాలుగు ప్యాకెట్లు కనిపించాయి. దీంతో కస్టమ్స్‌ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ. 5.6 కిలోల బరువు ఉన్న 48 బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బంగారం విలువ దాదాపు రూ. 2.24 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.  ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్టు వెల్లడించారు. కాగా, దుబాయ్‌ నుంచి చెన్నై వచ్చిన ఆ విమానం.. అనంతరం సర్వీస్‌ నంబర్‌ మార్చుకుని ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: