జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేందుకు ఎల్లోమీడియా చివరకు శవాలతో కూడా బేరాలు మాట్లాడుకుంటోంది. ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైందని, భవన నిర్మాణ కూలీలు, తాపీ మేస్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ చంద్రబాబునాయుడు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా జగన్ కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్న విషయం తెలిసిందే.

 

ఈ విషయాలు ఇలావుండగానే తాజాగా జరిగిన ఓ ఘటన సంచలనం సృష్టిస్తోంది. బాపట్ల మండలంలో నలుకుర్తి రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ ఆత్మహత్య విషయం స్ధానికంగా ప్రచారం జరిగింది. వెంటనే ఎల్లోమీడియా (టివి5, ఈటివి-2) రిపోర్టర్లు మృతుడి ఇంటికి వెళ్ళిపోయారు.

 

ఇసుక కొరత వల్ల పనులు దొరకకపోవటంతో తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాలని ఒత్తిడి చేశారు. తాము చెప్పినట్లు చెబితే ఆత్మహత్య చేసుకున్న సోదరుడి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇప్పిస్తామని చెప్పారు.  మొత్తానికి రకరకాలుగా ప్రలోభాలు, ఒత్తిళ్ళ తర్వాత మృతుడి సోదరుడు సురేష్ ఇసుక కొరత వల్లే తన రమేష్ చనిపోయాడని చెప్పటానికి రెడీ అయ్యాడు.

 

అయితే జరుగుతున్న తతంగాన్ని గమనిస్తున్న కొందరు సురేష్ ను అడ్డుకున్నారట. ఎందుకంటే రమేష్ రైతు. నిర్మాణ రంగంతో ఏమాత్రం సంబంధం లేనివాడు. భవన నిర్మాణ కూలీ కాదు, తాపీ మేస్త్రి అంతకన్నా కాదు. పైగా చాలాకాలంగా ఫిట్స్ తో బాధపడుతున్నాడట.  అందుకే  తప్పుడు మాటలు చెప్ప వద్దని హెచ్చరించారట. దాంతో ఎల్లోమీడియా విలేకరులు చెప్పినట్లు చెప్పటానికి నిరాకరించాడు.

 

అదే సమయంలో మిగిలిన మీడియాతో ఎల్లోమీడియా ఒత్తిడి గురించి అసలు విషయం చెప్పేశాడట. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో జగన్ ప్రభుత్వాన్ని గబ్బు పట్టించటానికి ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియా పడుతున్న పాట్లు బయటపడింది. ఎక్కడైనా సమస్యుంటే దాన్ని హైలైట్ చేయటంలో తప్పేమీ లేదు. కానీ సమస్య లేని చోట కూడా జగన్ ప్రభుత్వంలో  ఘోరం జరిగిపోయిందని చెప్పటానికి ఎల్లోమీడియా ప్రయత్నిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. అందుకనే జగన్ ఎల్లోమీడియా అంటే మండిపోతున్నది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: