వైఎస్ జగన్ ఆరు నెలల క్రితం అధికారంలోకి వచ్చినపుడు మధ్యాహ్న మార్తాండుడు. ఆయన వైపు కన్నెత్తి చూడడానికే సాహసించలేని పరిస్థితి. ఆ తరువాత  సామాజిక న్యాయం పేరిట  మంత్రుల  కూర్పు కూడా జగన్ కి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఇక పాలనలో చకచకా నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ముందుకు సాగుతుంటే ఆయన చెప్పినట్లుగానే ముప్పయ్యేళ్ళ సీఎం ఏమోనని అంతా అనుకున్నారు. అయితే  నాలుగు నెలలు  నిండి అయిదవ నెలలో ప్రవేశించేటప్పటికే జగన్ పాలల కిందా మీద అవుతోంది. 


ఒక్కసారిగా లేచిన ఇసుక తుపాను జగన్ సర్కార్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏపీలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో  ఇసుక కొరత పాపం వైసీపీదేనని వేలెత్తి చూపిస్తున్నాయి. అదే సమయంలో చేతగాని ప్రభుత్వం అని నిందిస్తున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ ప్రభుత్వం మరింతగా దూకుడు పెంచి మూడు జీవేలను ఈ మధ్యకాలంలో వరసగా తీసుకువచ్చింది. వాటితో మొత్తం ప్రతిష్ట పోయిందని అంతా అనే పరిస్థితి వచ్చేసింది. అందులో మొదటికి మీడియా నియంత్రణ కోసం తెచ్చిన జీవో. ఇది సర్కార్ చెబుతున్నట్లుగా మంచిగా లేకపోగా మీడియా మొత్తానికే సంకెళ్ళు వేసేలా ఉందని అంటున్నారు. ఎల్లో మీడియా గట్టిగా హడావుడి చేస్తే దాన్ని ఎదుర్కోవాలి కానీ మొత్తం మీడియా మీదనే ఉక్కుపాదం మోపడమేంటని అంటున్నారు.


ఇక రెండవ జీవో వివాదాలు లేని మచ్చ లేని అధికారి ఎల్వీ సుబ్రమణ్యాన్ని అకస్మాత్తుగా  బదిలీ చేయడం. ఆయన్ని అప్రధామైన శాఖకు పంపించడం. దీని వల్ల కూడా ప్రభుత్వాన్నికి ఎక్కడలేని చెడ్డపేరు వచ్చింది. ప్రధానంగా ఓ సామాజికవర్గం కూడా ఈ విషయంలో జగన్ మీద గుర్రుమంటోంది.  ఎల్వీని తప్పించిన తీరుతో ఐఏఎస్ లు కూడా రగిలిపోతున్నారు. ఇది ప్రతిపక్షానికి కూడా రాజకీయ అంశమైంది. ఇక మూడవది అబ్దుల్ కలాం పేరిట ఇచ్చే ప్రతిభా పురస్కారాన్ని వైఎస్సార్ విద్యా పురస్కారంగా మార్చే జీవో, దీని మీద పెద్ద రచ్చ అయ్యాక కానీ ప్రభుత్వం సర్దుకోలేదు. ఈ మూడు జీవోలు ఒక్కసారిగా జగన్ గ్రాఫ్ ని తగ్గించేశాయి. ఇన్నాళ్ళూ జగన్ పాలన బాగుందన్న వారే ఏం జరుగుతోంది అసలు. ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది అన్న చర్చలో పడిపోతున్నారు ఇప్పటికైనా జగన్ సర్కార్ తడబాట్లూ పొరపాట్లూ పక్కన పెట్టి సవ్యంగా పాలన చేస్తే మేలు అంటున్నారు. లేకపోతే ఇమేజ్ డ్యామేజే అని హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: