ఆర్టీసీ అంటేనే ప్రజా రవాణా సంస్థ. అందుకే దీన్ని కాపాడాల్సిన బాధ్యత, ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా ఉంటుంది.. అలాగే ప్రజలు కూడా సురక్షితమైన ప్రయాణం చేయడం కోసం ఆర్టీసి బస్సులను ఆశ్రయిస్తుంటారు. ఇక ఈ సంస్థకు స్వయం ప్రతిపత్తి అనేది లేదు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ప్రజాసేవయే మా కర్తవ్యం అంటూ నిజాయితీగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ నేడు నష్టాల ఊబిలో కూరుకుపోయింది..


ఇదివరకు వచ్చే నష్టాలు చాలవన్నట్లుగా ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఈ రోజుకు అంటే బుధవారానికి 33వ రోజుకి చేరింది. తెలంగాణలో 48వేల మంది కార్మికులు  తమ 26 డిమాండ్ల సాధన కోసం 28 రోజులుగా సమ్మెను కొనసాగిస్తుండటం చూస్తుంటే ఈ సమస్య ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇన్ని రోజుల పాటు సమ్మె కొనసాగడం ఇదే తొలిసారి కావడం ఆశ్చర్యకరమైన విషయం.


ఇక ఈ సమ్మెవల్ల తెలంగాణ ప్రభుత్వానికి కలిగే నష్టం కొన్ని కోటల్లో ఉంది. ఇకపోతే ఇప్పుడు ప్రభుత్వం సమ్మెవల్ల నష్టపోతున్న డబ్బును తిరిగి ఎలా రాబడుతుందో అనే  భయం ప్రతి సామాన్యుడి కంటికి నిద్దుర లేకుండా చేస్తుంది. ఇప్పటికే సమ్మె విషయంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేక విఫలమైంది. ఓ వైపు కార్మిక సంఘాలు కూడా తమ డిమాండ్ సాధనలకోసం కఠినంగా ప్రవర్తిస్తున్నారనే మాట వినిపిస్తుంది. ఇందులో ఏ ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రాభివృద్ది విషయంలో ఈ ఆర్టీసీ సమ్మె కీలక పాత్ర పోషిస్తుందని ఎందుకు గమనించలేక పోతున్నారో అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.


ఈ నష్టాన్ని మోయడానికి ప్రభుత్వానికి సామాన్యుడు తేరగా దొరికాడు కదా అందుకే ఈ భారమంత ఏదో ఒకరోజు  ప్రయాణికుల విషయంలో అధిక ధరలు పెంచి తమ ఖజాన నింపుకుంటుందనడంలో సందేహం లేదు. ఇకపోతే ఇప్పటికే చాలీ చాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న సామాన్యుడూ త్వరలో ప్రభుత్వం వేసే భారాన్ని ఎంతవరకు భరిస్తాడో తెలియదు. ఒక వేళ ప్రభుత్వం ప్రజలపై భారం వేయవద్దనుకుంటే ఇప్పుడు జరిగిన, జరుగుతున్న నష్టాన్ని పూడ్చే మార్గాలు వెతకవలసి ఉంటుంది. అలాకాని పక్షంలో ఎక్కడ దిక్కులేకపోతే ప్రజలే దిక్కు అందుకే వారిపైన భారం వేయడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: