ప్రస్తుత ఆధునిక కాలంలో ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువ అయంది. ఈ ప్లాస్టిక్ సంచుల వలన చాలా ప్రదేశాలలో పర్యావరణము చాలా దెబ్బతింటున్నది. కలుషిత పర్యావరణ ము ను కాపాడుకొనుటకు మన ప్రభుత్వము ఎన్నో చర్యలు తీసుకుంటున్నది. అయినా కూడా సరిగా రావడం లేదు. దేశంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ విస్తరాకులు,  కప్పులు, కవర్లు దర్శనమిస్తున్నాయి. అది యును గాక అది పరివాహక ప్రాంతము నందు కూడా ఎక్కువ ప్లాస్టిక్ కవర్లు దర్శనమిస్తున్నాయి. దీనివలన నీటి కాలుష్యం కూడా ఏర్పడుతున్నది. 


ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఈ విధంగా అనేక క ఆటంకాలను కలిగిస్తున్న ప్లాస్టిక్ కు బదులుగా, ప్రత్యామ్నాయముగా, మొక్కజొన్న పిప్పితో తయారుచేసిన టీ కప్పులు, బ్యాగులు, గ్లాసులను గ్రీన్ బయో డీ గ్రేడబుల్ అనే సంస్థ తయారుచే సింది. మంగళవారము హైదరాబాదులో ని అరణ్య భవన్ లో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ఇ వీటిని ఆవిష్కరించారు. 


ఆంధ్రప్రదేశ్లో కావలసినంత మొక్కజొన్న పిప్పి లభిస్తుంది. ఈ పిప్పి తో తయారయిన కప్పులు, బ్యాగులు, ప్లేట్లు, సులభంగా మట్టిలో కలిసిపోతాయి. పర్యావరణము దెబ్బతినదు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలలో పర్యావరణ రహిత, ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన కల్పించి తాము అని చెప్పారు. అలాగే కే వాడే ప్లాస్టిక్ కప్పులకు బదులుగా మొక్కజొన్న పిప్పితో తయారుచేసిన కప్పులను వాడుతాము అని తెలియజేశారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, గ్రీన్ బయో డీగ్రే డబుల్ సంస్థ ప్రతినిధులు సదానందం, అనూ ప్చారి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ప్లాస్టిక్ ను సాధ్యమైనంత తక్కువగా వినియోగించడం ప్రజల వ్యక్తిగత బాధ్యత. ప్రభుత్వము కూడా ప్లాస్టిక్ కవర్లను తయారు చేసే సంస్థలను మూసి వేయించాలి.ఎప్పుడైతే ప్లాస్టిక్ తయారుచేసే సంస్థలు మూత పడతాయో అప్పుడే ప్రజలు ప్రత్యామ్నాయముగా జూట్బ్యాగులు, కాగితము బ్యాగులు, సాధారణ వస్త్రాలతో తయారుచేసిన వాడకం పెరుగుతుంది.  జీవ శైథిల్య వస్తువులు ఎక్కువగా వినియోగించాలి. ప్రభుత్వము ప్లాస్టిక్ వాడొద్దని నూరు కోట్ల ప్రజలను బ్రతిమాలి బదులుగా, పదివేల మంది తయారుచేసే ప్లాస్టిక్ కంపెనీలను మూసి వేయించ వచ్చు కదా!
తప్పు. జ్యూట్ బ్యాగులు, సాధారణ వస్త్రాలతో తయారుచేసిన సంచుల వాడకము పెరుగుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: