ఆర్టీసీ సమ్మె మొదలు ముప్పై మూడు రోజులకు చేరుకుంది. అయితే 33 రోజుల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ డిమాండ్లు పరిష్కారం విషయంలో సానుకూలంగా స్పందించలేదు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రైవేటు బస్సులను నడుపుతోంది. ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లు అందరు ఆర్టీసీ సమ్మెలో ఉండడంతో... ప్రభుత్వం తిప్పుతున్న బస్సులను నడిపేందుకు తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లను నియమించింది ప్రభుత్వం. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా తాత్కాలిక ఉద్యోగుల తీరు మాత్రం అస్సలు బాగోలేదు. ప్రయాణికుల పట్ల దురుసుగా వ్యవహరించడం... సహా ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు తాత్కాలిక కండక్టర్లు. ఆర్టీసీ యాజమాన్యం సూచించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తూ జేబులు నింపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక డ్రైవర్ల మాటకొస్తే  యమకింకరులు గా మారిపోతున్నారు తాత్కాలిక డ్రైవర్లు. మద్యం తాగి వాహనాలు నడపడం.... అతి వేగంగా వాహనాలు నడపడం వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను సైతం బలి కొన్నారు తాత్కాలిక డ్రైవర్లు. 

 

 

 

 దీంతో ఆర్టీసీ బస్సు ఎక్కాలి అన్న ప్రజలు జంకుతున్నారు. తాత్కాలిక డ్రైవర్లు తీరుతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణికులు. ఇదిలా ఉండగా ప్రభుత్వం తిప్పుతున్న బస్సులను నడిపేందుకు నియమించబడిన తాత్కాలిక ఉద్యోగులు ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో రెచ్చిపోయారు. ఏకంగా తాత్కాలిక ఉద్యోగులు చేతివాటం చూపించారు. ఏకంగా 15 వేల రూపాయలను పట్టుకునేందుకు ప్రయత్నించారు. 4 కవర్ లలో ఈ సొమ్మును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా తాత్కాలిక ఉద్యోగుల  చేతివాటానికి గుర్తించిన ఆర్టీసీ కార్మికులు వాళ్లని పట్టుకున్నారు. అయితే తాత్కాలిక సిబ్బంది చేతివాటం చూసి అధికారులు షాక్ అవుతున్నారు. ఇక ఇలాంటి చర్యలు ఇప్పటికే ఇంకెన్నిసార్లు పాల్పడ్డారో  అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. 

 

 

 

 అయితే తాత్కాలిక సిబ్బంది చేతివాటం చూపించడం ఆర్టీసీ లో  కలకలం రేపుతోంది. అయితే తాత్కాలిక ఉద్యోగులు చేతివాటం చూపించడం పై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కార్మికులు చూసి పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది... కార్మికులు చూడకుండా ఎన్ని సార్లు తాత్కాలిక ఉద్యోగులు  చేతివాటం చూపించారో అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా బస్సులు నడిపకుండ చేతివాటం చూపిస్తారా ఇలా అయితే ఆర్టీసీకి ఇక ఆర్థిక ఇబ్బందులు తప్పవు  అంటూ పెదవి  విరుస్తున్నారు. అయితే తాత్కాలిక ఉద్యోగుల చేతివాటం బయటపడడంతో అటు అధికారులు కూడా కాస్త అలర్ట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: