ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రం ఉద్యోగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగా ప్రస్తుతం ఇండియన్‌ నేవీలోను 2700 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

                

భారత రక్షణ శాఖ పరిధిలోని ఇండియన్‌ నేవీలో సెయిలర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి 2020 ఆగస్టులో ప్రారంభం కానున్న ఆర్టిఫిసర్ అప్రెంటిస్(AA), సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) బ్యాచ్‌ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. పెళ్లికాని పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని ప్రకటించింది. కాగా విద్య అర్హత ఇంటర్ 'మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్'లో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు అభ్యర్ధికి నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

                          

కాగా పోస్టులకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 'సెయిలర్స్ - AA & SSR - ఆగ‌స్టు 2020 బ్యాచ్. ఇందులో మొత్తం 2700 ఖాళీలు ఉన్నాయి. ఆర్టిఫీష‌ర్‌ అప్రెంటిస్‌ (AA): 500 పోస్టులు ఉన్నాయి. సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌ లో 2200 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు ఇంటర్ అర్హతతో పాటు వయసు 01.08.2000 - 31.07.2003 మధ్య జన్మించి ఉండాలి. అయితే ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కాగా ఈ పోస్టులకు ఎంపిక చేసుకునే విధానం కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలో అర్హత సాధించిన తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు. 

                  

మరింత సమాచారం తెలుసుకోండి: