బిజెపి నేతలు ఈ మధ్య మాట్లాడే మాటలు కొంచెం కూడా అర్థరహితంగా లేవు. వారు ఈ మధ్య కాలంలో ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లడుతున్నారు అన్న అపవాదను మరొకసారి బిజెపి పార్టీకి చెందిన వినీత్ అగర్వాల్ బలపరిచారు. ఢిల్లీ కి దగ్గరలో సరిహద్దు ప్రాంతాలైన యూపీ హర్యానాలోని రైతులు తమ పంటను వ్యర్థాలను కాల్చినందున వాయు కాలుష్యం ఏర్పడిన విషయం  తెలిసిందే.

అంతే కాకుండా మొన్న జరిగిన దీపావళి పండుగ సమయంలో బాణసంచాను కాల్చడం వల్ల కాలుష్య తీవ్రత మరింత పెరిగిపోయింది. అయితే బిజెపి నేత అయిన వినీత్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు మాత్రం హాస్యాస్పదంగా ఉన్నాయి. అవి ఏంటంటే తమ పార్టీని భయపెట్టేందుకు పాకిస్తాన్ మరియు చైనా దేశాలు కలిసి విషవాయువులను వదులుతున్నారు అంటూ వినీత్ ఆరోపించాడు.

అంతే కాకుండా మోడీ మరియు అమిత్ షాలు సాధించిన భారీ విజయాన్ని తట్టుకోలేక అసూయ పడి ఇలా విషవాయువులను దేశంపై ప్రయోగిస్తున్నారు అంటూ పొరుగు దేశాలను విమర్శించాడు. పంజాబ్ రైతులు పంట పొలాల్లో వ్యర్థాల్ని కాల్చటం కారణంగా వాయు కాలుష్యం పెరుగుతుందన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేశాడు వినీత్. 

దేశంలో ఏలాంటి సమస్యనైనా పరిష్కరించే సత్తా తమ పార్టీకి చెందిన ఒక్క మోడీ-అమిత్ షా ల కే ఉందని చెప్పిన అతను దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుల స్థాయిని తగ్గించడానికి పొరుగు దేశాలు కుట్ర పన్నాయని అంటున్నాడు. ఇలా ఒట్టి గాలి మాటలే కాకుండా పొరుగు దేశాలని విమర్శించేటప్పుడు కాస్త ఆధారాలు కూడా చూపిస్తే బాగుంటుంది లేకపోతే వారి చేతిలో బఫూన్ అవుతాడు అని ఆయన గమనించలేకపోతున్నాడు. ఇలాంటి అర్థం పర్థం లేని మాటల వల్ల పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని మోడీ సర్కార్ తెలుసుకుంటే మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: