ఇసుక సరఫరా పెంపుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్‌ పోలీసు అధికారులు రవిశంకర్‌ అయ్యన్నార్, సురేంద్రబాబు, గనుల శాఖ అధికారులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో సీఎం జగన్ ఇసుక మాఫియా, స్మగ్లింగ్‌ నివారణకు కఠిన చర్యలు ప్రకటించారు. 


ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఈలోగా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలంటూ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. కాగా ఇందులో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఇసుక ధరను నిర్ణయించాలని కలెక్టర్లకు, గనులశాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ ధరకు అమ్మితే జైలుకు పంపేలా చట్టం తీసుకు రావాలి అని ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో ఎంత రేటు పెట్టాలో కలెక్టర్లతో మాట్లాడి నిర్ణయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 


కాగా నిర్ణయించిన ధరలు ప్రజలకు అర్థమయ్యేలా కలెక్టర్లు ప్రచారం చేయాలి అని, నిర్ణయించిన రేటుకే ఇసుకను అమ్మాలి అని.. అంతలోపు ఇసుక సరఫరాని బాగా పెంచాలి అని చెప్పారు. కాగా ఇసుకకు సంబంధించి ఒక టోల్‌ ఫ్రీ నంబర్‌ను పెట్టాలి అని అందులో ఇసుకను అధిక రేటుకు అమ్ముతున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి, జైలుకు పంపాలి అని సీఎం జగన్ సీరియస్ గా ఆదేశాలు జారీ చేశారు. 


కాగా సీఎం జగన్ మాట్లాడుతూ వచ్చే వారం స్పందన నాటికి ఈ రేట్లు, టోల్‌ ఫ్రీ నంబర్‌ ప్రకటించాలి అని, వచ్చేవారం స్పందన కేవలం ఇసుక సమస్యపైనే నిర్వహించాలి అని స్పందనలో ఇసుక వారోత్సవం తేదీల ప్రకటించాలి అని అన్నారు. కాగా సరిహద్దుల్లో నిఘాను పెంచాలని ఎట్టిపరిస్థితుల్లోనూ స్మగ్లింగ్‌ జరగకూడదు అని టెక్నాలజీని వాడుకోవాలి అని సీఎం జగన్ సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: