మనిషి జీవితం. నవ్వుకు ఏడుపుకు మధ్య ఊగిసలాడే అధరం. మనిషి జీవితం. కష్టాలకు, కన్నీళ్లకు మధ్య నలిగే నయనం. ఇవ్వన్నిటికి అలవాడు పడితేనే బ్రతుకు సమరంలో విజేతలుగా నిలిచేది. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా నిర్లక్ష్యం నిలువునా దహించి వేస్తుంది. ఇలా ఈకాలంలో ఎందరో తమ జీవితాలకు సరైన గమ్యాన్ని నిర్దేశించుకోక పోతే సహజంగా చెడు వైపు ఆకర్షణ తప్పదు. అప్పుడు తాను చేస్తున్న తప్పులు కూడా ఒప్పుగా కనిపిస్తాయి. అలా తప్పుడు మార్గం వైపు పయణించే మనిషి తనతో పాటుగా తనను నమ్మిన వాళ్లను కూడా మోసం చేస్తూ తాను మోసపోతుంటాడు. చాల అందంగా గడపవలసిన జీవితాన్ని అంధకారంగా మార్చుకుంటున్నాడు.


ఇలా చేసి ఓ యువకుడు తన పచ్చని సంసారంలో నిప్పులు పోసుకున్నాడు. కట్టుకున్న భార్యతోనే పోర్న్ వీడియోలు తీసేందుకు యత్నించి నవ్వులపాలైయ్యాడు, చివరికి కటకటాలపాలైనాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే  అలీఘడ్‌కు చెందిన మనోజ్‌కు గతేడాది డిసెంబర్ 9వ తేదీన ఓ యువతితో వివాహమైంది. చెడు అలవాట్లకు బానిసైన అతడు బెట్టింగులు, జూదంలో రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌ సందర్భంగా క్రికెట్ బెట్టింగుల్లో ఏకంగా రూ.45లక్షలు వరకు కోల్పోయాడు. అప్పటికి బుద్దితెచ్చుకోక చేసిన అప్పులు తీరే మార్గం కోసం  ఓ దారుణమైన ఫథకం వేశాడు. అతని పధకం ఎలాంటిదంటే భార్యభర్తల బంధానికే మచ్చతెచ్చేలా. అసలు సమాజంలో ఏ భార్య ఏ భర్తను జీవితంలో నమ్మకుండా ఉండేలా ప్రవర్తించాడు.


 హనీమూన్ పేరుతో ఆవిడను నమ్మించి డార్జిలింగ్‌కు తీసుకెళ్లాడు. తన భార్యకు తెలియకుండా తన అక్క, బావను కూడా అక్కడికి తీసుకెళ్లి వేరే గదిలో ఉంచాడు.. ఇక తన గదిలో ఓ రాత్రి భార్యకు మద్యం తాగించి ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. అలా చేస్తున్న సమయంలో తరచుగా వారు పడుకున్న బెడ్ గోడవైపు చూస్తుండటంతో అనుమానం వచ్చిన ఆమె లేచి చూడగా అక్కడ చిన్న కెమెరా కనిపించింది. అదేంటని భర్తను నిలదీయగా అప్పులు తీర్చేందుకు వేరే మార్గం కనిపించలేదని, అందుకే మన శృంగార సన్నివేశాలను పోర్న్ వెబ్‌సైట్లో పెడితే రూ.లక్షలు సంపాదించొచ్చని మనోజ్ ఆమెను ఒత్తిడి చేశాడు.


అలాంటి నీఛమైన పనికి ఆవిడ ఒప్పుకోక పోవడంతో పక్క గదిలో ఉన్న తన అక్క, బావను పిలిచి భార్యపై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అంతే కాకుండా  పోర్న్ వీడియోలు తీస్తేనే నీతో కాపురం చేస్తా, లేదంటే వదిలేస్తా అంటూ బెదిరించాడు. అప్పటికే భర్త ప్రవర్తనపై విసిగిపోయిన బాధితురాలు వెంటనే పుట్టింటికి వెళ్లి విషయం చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను ప్రారంభించారు. చూసారా లోకంలో ఇలాంటి పనులు చేసేవారు రోజు రోజుకు ఎక్కువైపోతుంటే మూడుముళ్ల బంధానికి ఉన్న విలువ దిగజారిపోవడమే కాకుండా అసలు పెళ్లంటేనే నమ్మకం కోల్పోతారు. ఇది ఈనాటి లోకం పోకడ....

మరింత సమాచారం తెలుసుకోండి: