బంగారం ధరలు ఒకోరోజు ఒకోలా ఉంటున్నాయి. ఒకసారి తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. ఈ బంగారం ధరలు తగ్గటానికి కారణం ఏది అయినా అవ్వచ్చు పెళ్లిల సీజన్ లో ఇలా బంగారం తగ్గటం పసిడి ప్రియులకు ఆనందాన్ని ఇస్తుంది. బంగారం ధర ఇంకా తగ్గాలని పసిడి ప్రేమికులు కోరుకుంటున్నారు. అయితే ఇంత వరుకు తగ్గింద అని చెప్పను కానీ ఎంత తగ్గిందో చెప్పలేదు కదా. 

           

అదేనండి.. బుధవారం బంగారం ధరలు భారీగా దిగి వచ్చాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 301 రూపాయి తగ్గి 39 వేళా దిగువకు పడిపోయింది. దీంతో ఒక్కసారిగా పసిడి ప్రేమికులు ఆశ్చర్యంతో పండుగ చేసుకోవడం మొదలు పెట్టారు. కాగా బంగారం ధరలు తగ్గటానికి అంతర్జాతీయ బలిచిన సంకేతాలు, డిమాండ్ పడిపోవటంతో బంగారం ధర ఇలా దిగివస్తుంది అని అంటున్నారు మార్కెట్ నిపుణులు. 

              

నేడు దేశ రాజధాని అయినా ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ. 38,870 చేరింది. అటు వెండి కూడా బంగారం బాటే పట్టింది. బంగారం వందల్లో రేటు తగ్గితే వెండి వేలల్లో రేటు తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో కేజీ వెండి ధర వెయ్యి రూపాయిలు తగ్గి రూ. 46,409కు చేరింది. కాగా ఇదే సమయంలో రూపాయి క్షిణించడం, అమెరికా చైనా మధ్య త్వరలో వాణిజ్య చర్చలు జరుగుతాయి అని వార్తలు రావడంతో బంగారం ధరలు తగ్గాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. మరి ఈ బంగారం ధర ఇలానే తగ్గుతుందా ? లేక పెరుగుతుందా ? అనేది చూడాలి. 

              

మరింత సమాచారం తెలుసుకోండి: