అధికారం కోల్పోయినా...తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆధిపత్య పోరు మాత్రం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అయితే ఈ ఆధిపత్యపోరు రాజధాని నియోజకవర్గం తాడికొండలో మరి పీక్స్ కు వెళ్ళినట్లు కనబడుతుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ వర్గాల మధ్య అసలు పొసగడం లేదని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో తాడికొండ నుంచి శ్రవణ్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మొన్న ఎన్నికల్లో శ్రవణ్ వైసీపీ అభ్యర్ధి ఉండవల్లి శ్రీదేవి చేతిలో ఓటమి పాలయ్యారు.


అటు డొక్కా మాణిక్యప్రసాద్ ప్రత్తిపాడులో పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలోనే డొక్కా కన్ను తన సొంత నియోజకవర్గం తాడికొండపై పడింది. డొక్కా అంతకముందు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడే నుంచే గెలిచి మంత్రిగా కూడా పని చేశారు. అందుకే ఆయన మళ్ళీ తిరిగి తాడికొండకు రావాలని చూస్తున్నారు. అక్కడ బలం పెంచుకుని వచ్చే ఎన్నికలనాటికి పోటీ చేయాలని భావిస్తున్నారు. పనిలో పని తన అనుచర వర్గంతో శ్రవణ్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం లేదని ప్రచారం చేయిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇదే విషయాన్ని అధిష్టానానికి కూడా అర్ధమయ్యేలా చేసి, వచ్చే ఎన్నికల్లో తాడికొండ సీటు దక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న శ్రవణ్ వర్గం....డొక్కా వర్గం చేసే ప్రచారన్ని తిప్పికొడుతున్నారు. శ్రావణ్ పార్టీకి విధేయుడని, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేడని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. అసలు డొక్కా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడంలేదని, రివర్స్ లో అధిష్టానానికి ఫిర్యాదులు  చేస్తున్నారు.


అయితే తాడికొండపై ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకుల ఫిర్యాదులతో నియోజకవర్గంలో అలజడి రేగుతోంది. ఒక‌రికి ఒక‌రు పొగ పెట్టేకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ రెండు వర్గాల ఆధిపత్య పోరులో కార్యకర్తలు కూడా ఎవరికి మద్ధతు ఇవ్వాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి కూడా టీడీపీ కోలుకోలేదు. మరి ఈ పోరుని బాబు ఎలా తీరుస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: