రాజకీయంగా ఇబ్బంది పడుతున్న తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యవహారశైలి తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆయన దెబ్బకు సీనియర్, జూనియర్ నేతలు అందరూ ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇదేం వ్యవహారశైలి అంటూ ముక్కున వేలేసుకునే పరిస్థితి నెలకొంది. 2017 లో లోకేష్ ని ఎమ్మేల్సీని చేసి చేసి చంద్రబాబు ప్రభుత్వంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అప్పటి వరకు పార్టీకి పరిమితమైన లోకేష్ ఆ తర్వాత ప్రభుత్వంలో తన పాత్రను పోషించడం మొదలుపెట్టారు.


రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పతనం లోకేష్ అడుగుతోనే మొదలైందని అక్కడి నుంచి కొందరు వ్యాఖ్యలు చేశారు. అసలు దానికి కారణం ఏంటి అనేది చూస్తే... ప్రభుత్వంలో సీనియర్ అధికారుల మాట గాని, సీనియర్ మంత్రుల మాట గాని చెల్లుబాటు అయ్యేది కాదు. ముఖ్యమంత్రి కార్యాలయ౦ మీద లోకేష్ పెత్తనం ఎక్కువగా ఉండేది. ఇక ఇప్పుడు అది అయిపోయింది. పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అయినా సరే లోకేష్ వ్యవహారశైలిలో ఏ విధమైన మార్పులు రాలేదట. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు లోకేష్ కి సలహాలు ఇవ్వడమే గాని ఆయన తీసుకోవడం లేదట.


రాజకీయంగా ఒక పక్క పార్టీ ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు ఆదేశాలను కాదని పార్టీలో తన పెత్తనం ఉండాలని లోకేష్ భావించి... కొంత మందిని వెనకేసుకుని వారికి సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారట. యువనేతలు వెళ్తే వారిని కట్టడి చేస్తూ, సీనియర్ నేతలను కట్టడి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారట. తాను ఏదో వ్యూహం అనుకుని ఆ వ్యూహాన్ని వాళ్ళు కూడా అమలు చెయ్యాలని అందరికి సూచించడం ఆశ్చర్యపరుస్తోంది. ఈ విషయం చంద్రబాబు వద్దకు వెళ్ళినా సరే ఆయన కూడా లోకేష్ ని మార్చలేక ఇబ్బందులు పడుతున్నారని సొంత పార్టీ నేతలే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: