మనిషిలో కలిగే ఓ దురాలోచన అతన్ని మృగంగా మార్చుతుంది. ఆ మృగం సమాజంలో మనిషి అనే తోలు కప్పుకుని సంచరిస్తూ మిగతా వారికి చేటు కలిగిస్తూ ప్రాణాలు తీస్తుంది. అది మృగం అని తెలిసేది ఎప్పుడంటే దానివల్ల జరగవలసిన నష్టం సమాజానికి జరిగి కొందరు అమాయకులు ప్రాణాలు కోల్పోయాక అప్పుడు అందరు అది మానవ మృగం అని గుర్తిస్తారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడున్న సొసైటీలో చాలా జరుగుతున్నాయి. కాని ఇక్కడ ఒక మనిషిని మోసం చేయాలంటే ముందుగా నమ్మకం, ఆశ అనే ఆయుధాలకు పదునుపెట్టి వాటిని మనుషుల మీదికి వదలాలి, అలా వదిలిన వలలో పడ్డవారిని నిలువునా అంతం చేయాలి.


ఇప్పుడు చాలామంది నేరస్దులు ఆచరిస్తున్న ఫార్ములా ఇది. ఒకరకంగా మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేస్తున్న వాడు పుడుతూనే ఉంటాడు. ఇది నిజం అని చెప్పవచ్చూ. ఇకపోతే మనిషి బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ తోడేలు ఇప్పటి వరకు పందిమంది ప్రాణాలను తీసింది. అదెలాగంటే ప్రసాదంలో సైనేడ్ కలిపి 20 నెలల కాలంలో ఈ దురాగతానికి పాల్పడ్డాడు. అతని పేరే సింహాద్రి. ఆలియాస్ శివగా చెలామని అయ్యే ఇతను ఏలూరు మండలం వెంకటాపురం పంచాయతీలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన వాడు. గతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేసిన ఇతను రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారాడు.


అనంతరం తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం ఎదుటి వారిని మోసం చేయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తన దగ్గర అసాధారణ శక్తులు ఉన్న దేవతల విగ్రహాలు, పురాతన నాణేలు ఉన్నాయని జనాలను నమ్మించేవాడు. అలా ఇతని వలలో చిక్కిన అమాయకులను మాటలతో బురిడి కొట్టించి పూచేయాలంటూ మొదట డబ్బు, బంగారం నగలు ఉంటే ఇవ్వమని చెప్పి సైనెడ్ ఉన్న పదార్ధాన్ని  ప్రసాదం పేరిట తినమని ఇచ్చేవాడు. వారు ఇతని మాటలు నమ్మి అది తినగానే ప్రాణాలు వదిలేవారు. అలా వారి దగ్గర్నుంచి సొమ్ము తీసుకొని అక్కడి నుంచి జారుకునేవాడు.


ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎర వేసేవాడు సింహాద్రి.. ఇక ఈ కేసును తవ్వుతున్న కొద్ది ఇతను చేసిన నేరాలా చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. ఈ క్రమంలో మరిబందం ప్రాంతానికి చెందిన పులపర్తి తవిటయ్య, మరణించగా అతని కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదుతో సింహాద్రిని అరెస్ట్ చేసిన నూజివీడు పోలీసులు అతని దగ్గరి నుండి 9లక్షలు రికవరీ చేసి వదిలేసారట. ఇలా ఇతను చేసిన అక్రమాల్లో ఇంకా ఎవరెవరికి ఎంత వాటాలున్నాయో త్వరలో తేల్చడానికి సిద్దమైయ్యారు పోలీసులు. ఇలాంటి వానికి తగిన శిక్ష మరణ శిక్ష కాబట్టి ఈ కేసును తొందరగా ఓ కొలిక్కి తెచ్చి నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృత్యువాతపడ్డ బాధితుల తాలుకూ బంధువులు కోర్టును కోరుతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: