ప్రత్యేక తెలంగాణా సాధన కోసం ఏ వర్గాలనైతే అప్పట్లో  రెచ్చగొట్టారో ఆ వర్గాలన్నీ ఇపుడు కెసియార్ కే ఎదురు తిరుగుతున్నాయి. ఇందులో ప్రధానమైన వర్గాల్లో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు కూడా ప్రధానం. గడచిన 34 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ముఖ్యమంత్రికి సినిమా చూపిస్తున్నారు.

 

తాను హూంకరిస్తేనో లేకపోతే కన్నెర్ర చేస్తేనో తనకు వ్యతిరేకంగా ఎవరూ ఎదురు నిలవలేరు అని అనుకున్న కేసియార్ కు సమ్మె పెద్ద  షాకే ఇచ్చింది. సమ్మె టెన్షన్ వల్లో ఇతరత్రా కారణాల వల్లో ఇప్పటికి సుమారు 20 మంది సిబ్బంది చనిపోయారు. దాంతో ఎంప్లాయిస్ లో సమ్మె విషయంలో మరింత పట్టుదల మరింత పెరిగింది.

 

ఏదో మూడు రోజులు సమ్మె చేసి తర్వాత వాళ్ళే చప్పపడిపోతారని అనుకున్న కేసియార్ అంచనాలు తల్లకిందులయ్యాయి. చివరకు సమ్మో సెగ కేంద్రానికి కూడా సోకినట్లు తాజా సమాచారం.  సమ్మె విషయంతో పాటు కేసియార్ వైఖరి, సమ్మె ప్రభావం లాంటి అంశాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపి నడ్డాతో కార్మిక సంఘాల నేతలు ఫిర్యాదు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

 

తమను ఉద్యోగాల్లో నుండి తీసేస్తామని కేసియార్ భయపడితే భయపడేవాళ్ళు ఎవరూ లేరని  ఆర్టీసీ జేఏసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తాజా ప్రకటన సంచలనంగా మారింది. తమ ఉద్యోగాలు తీసేయటం కేసియార్ వల్ల కాదన్నారు. పైగా సంస్ధను ప్రైవేటుపరం చేయటం సిఎం తరం కాదని సవాలు విసరటమే అసలైన ట్విస్టు.

 

కేసియార్ వైఖరికి నిరసనగా తొందరలోనే మిలియన్ మార్చ్ కు రెడీ అవుతున్నట్లు రెడ్డి ప్రకటించటం గమనార్హం. తమ విజ్ఞప్తికి బిజెపితో సహా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ, టిఎన్జీవో సంఘం కూడా మద్దతుగా నిలుస్తున్నట్లు చెప్పటంతో అధికార పార్టీలో కలకలం మొదలైంది.  మొత్తం మీద ఆర్టీసీ సమ్మె బాగా ముదిరిపోయి చివరకు ప్రత్యేక తెలంగాణా ఉద్యమ వాతావరణాన్ని గుర్తు చేస్తుండటమే కేసియార్ కు మింగుడుపడటం లేదు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: