పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇసుక సమస్యతో ఇబ్బంది పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని పవన్ చేపట్టారు. ఆరోజు జరిగిన సభలోనే వైసీపీ ప్రభుత్వ తీరును. ఆ పార్టీ నేతలను పవన్ టార్గెట్ చేశారు. జగన్, విజయసాయి రెడ్డి, కన్నబాబు, అవంతి శ్రీనివాస్.. ఇలా చాలామంది వైసీపీ నాయకులకు కౌంటర్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ట్విట్టర్ వేదికగా మళ్లీ వైసీపీపై యుద్ధం ప్రకటించారు.

 

 

అన్న మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన రుద్రవీణ సినిమాలోని రెండు పాటలను పోస్ట్ చేస్తూ దీనిని వైసీపీ ప్రభుత్వ తీరును పోల్చుతూ ఆయన ఓ పోస్ట్ చేశారు. సినిమాలోని రెండు పాటల వీడియోలను పోస్ట్ చేస్తూ ఈ పాటలోని సాహిత్యం మాదిరిగానే ప్రభుత్వం తీరు ఉందని ఎద్దేవా చేశారు. వైసీపీ ఇచ్చిన హామీలకు ఇప్పుడు అమలు చేస్తున్న హామీలకు చాలా తేడా ఉందంటూ.. ‘నమ్మకు నమ్మకు ఈ రేయి’ పాటను ఉంచారు. వైసీపీ నేతల జీతాలు లక్షల్లో తీసుకుంటుంటే భవన కార్మికులు మాత్రం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇందుకు ఈ పాట ఉదాహరణ అంటూ..’చుట్టూపక్కల చూడరా చిన్నవాడా..’ అనే పాటను పోస్ట్ చేశారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆయన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని ఈ పోస్టుల ద్వారా అర్ధమవుతోంది. దీనిపై వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సిందే.

 

 

‘జీవితంలో నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసిన సినిమా ఇది. సామాజిక కార్యకర్త అన్నాహజారే స్ఫూర్తిగా ఈ సినిమాకు ప్రఖ్యాత దర్శకుడు బాలచందరర్ దర్శకత్వం వహించారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతాన్ని మాస్ట్రో ఇళయరాజా అందజేశారు. మా అన్నయ్య నాగబాబు నిర్మించగా.. మా పెద్దన్నయ్య గారు హీరోగా నటించారు’ అని చెప్పుకొచ్చారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: