జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా భారీ కుట్ర మొదలైనట్లు అనుమానంగా ఉంది.  గడచిన ఐదు నెలల పాలనలో  తనకు వ్యతిరేకంగా  యాగీ చేయటానికి ప్రతిపక్షాలకు జగన్ పెద్దగా అవకాశం ఇవ్వలేదు. అయినా ఎల్లోమీడియా మద్దతుతో  చంద్రబాబు, పవన్, కన్నా లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు పదే పదే జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే జగన్ వీళ్ళెవరినీ కనీసం లెక్క కూడా చేయటం లేదు.

 

ఈ నేపధ్యంలోనే  ఇసుక కొరత సమస్య మొదలైంది. ఇసుక కొరత ఉన్నమాట వాస్తవమే కానీ ప్రతిపక్షాలు చెబుతున్నంత స్ధాయిలో అయితే లేదు. కానీ ఎల్లోమీడియా మద్దతుంది కాబట్టి జగన్ ను గబ్బుపట్టించే కార్యక్రమం జరిగిపోతోంది. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నాలు ఏకమవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. సామాజిక వర్గాలపరంగా జగన్ కు వ్యతిరేకంగా కమ్మ, కాపులను ఏకం చేయాలనే టార్గెట్ తో వీళ్ళు ఏకమయ్యారనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత అయితే పవన్ , కన్నాలిద్దరు కాపు నేతలు. మొన్నటి ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తేవటానికి  కమ్మ సామాజికవర్గం ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అదే సమయంలో పవన్ ద్వారా కాపుల ఓట్లు జగన్ కు పడకుండా చేయాలని చంద్రబాబు ఎంత  ప్రయత్నించినా సాధ్యం కాలేదు.  

 

వివిధ వర్గాలను కూడగట్టుకుని జగన్ అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇటు చంద్రబాబు అటు పవన్ కు బాగా మంటగా ఉంది.  మామూలుగా ఎన్నికలైపోయిన తర్వాత ఓడిపోయిన మంట మెల్లిగా తగ్గిపోతుంది. కానీ వీళ్ళిద్దరి మంట రోజురోజుకు పెరుగుతోంది. దాంతోనే వీళ్ళిద్దరు తమకు మద్దతుగ కన్నాను కూడా కలుపుకున్నట్లే కనబడుతోంది.

 

ఇందుకోసమే టిడిపి నుండి రాజ్యసభ ఎంపిలను చంద్రబాబు బిజెపిలోకి పంపినట్లున్నారు. మొత్తానికి  ఈ విషయంలో చంద్రబాబు సక్సెస్ అయినట్లే ఉన్నారు. వీళ్ళకు ఎల్లోమీడియా అండ ఎలాగూ ఉంది. కాబట్టే హఠాత్తుగా తలెత్తిన  ఇసుక కొరతను అడ్డం పెట్టుకుని పై రెండు సామాజికరవర్గాల తరపున జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు, పవన్, కన్నా ఏకమైనట్లే అనుమానంగా ఉంది.  వీళ్ళ నలుగురిలో ఎవరి సత్తా ఏంటో తేలాలంటే తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల వరకూ ఆగాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: