రాష్ట్ర చరిత్రలో గతంలో ఏ ప్రతిపక్ష నేత కూడా చేయని పనికిమాలిన పనిని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చేస్తున్నాడు. అధికార యంత్రాంగాన్ని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారు. జగన్ చెప్పిన ప్రతి పనిని అడ్డుగోలుగా చేస్తే తాజా మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం గతే పడుతుందని చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే మొన్నటి ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవాన్ని ఇంకా మరచిపోయినట్లు లేదు.

 

జగన్ చేతిలో చావుదెబ్బ తిన్న అవమానంతో చంద్రబాబు రగిలిపోతున్న విషయం అందరికీ అర్ధమైపోతోంది.  అందుకనే అడ్డదిడ్డమైన వ్యాఖ్యలతో జగన్ పై రెచ్చిపోతున్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లో జగన్ అడ్డదిడ్డమైన పనులేమీ చెప్పినట్లు కనబడలేదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అకాస్మత్తుగా బదిలీ చేయటం తప్పే. కానీ ఏ అధికారిని ఎక్కడ ఉపయోగించుకోవాలన్నది పూర్తిగా జగన్ విచక్షణపైన ఆధారపడిన విషయం.

 

గతంలో చంద్రబాబు కూడా ఇలాగే చాలామందిని అర్ధాంతరంగా బదిలి చేసిన ఘటనున్నాయి. ఆనందరావు, స్వామినాధన్ అనే ఇద్దరు ప్రధాన కార్యదర్శులను కూడా తాను ఇలాగే హఠాత్తుగా బదిలీ చేసిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. జగన్ ను నమ్మవద్దని ఉన్నతాధికారులను చంద్రబాబు రెచ్చగొట్టటమేంటో అర్ధం కావటం లేదు.

 

చెప్పిన పనల్లా చేసిన వాళ్ళని గతంలో జైలుకు పంపిన విషయం అందరూ గుర్తుంచుకోవాలంటూ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఆశ్చర్యంగా ఉంది. జగన్ చెప్పిన పనల్లా చేస్తే భవిష్యత్తులో కూడా అదే జరుగుతందంటూ దారుణమైన కామెంట్ చేశారు. అప్పట్లో జగన్ వల్ల జైలుకు వెళ్ళారని ఎవరినైతే చంద్రబాబు ఉదహరిస్తున్నారో వాళ్ళే ఇపుడు జగన్ ఆధ్వర్యంలో పనిచేస్తామని ముందుకొస్తున్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. ఏదేమైనా గతంలో ఏ ప్రతిపక్ష నేత కూడా చేయని పనికిమాలిన పనిని ఇపుడు చంద్రబాబు చేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: