ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసిన అందులో ఏదో ఒక వంక చూపి .. తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను తప్పు దోవ పట్టించడానికి పచ్చ మీడియా చేయనటువంటి ప్రయత్నం లేదు. ఇప్పుడు తాజాగా పోలవరం రివర్స్ టెండరింగ్ లో తప్పుడు కథనాలను ప్రచురిస్తుంది.  రివర్స్ లో ఆదా అయ్యే మొత్తం కన్నా ఇసుక కారణంగా అదనపు భారం పడుతుందంటూ బురదజల్లే కుతంత్రాలు మొదలయ్యాయి. తమ వారికి దక్కలేదన్న అక్కసు పచ్చ మీడియాలో పడగలెత్తుతున్నది. ఎలాగైన రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలవరం నిర్మాణ బాధ్యతలను తక్కువ ధరకే భుజానకెత్తుకున్న కంపెనీని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు ఊపందుకున్నాయి. పోలవరం రివర్స్ టెండర్ డాక్యుమెంట్ లో ఇసుకకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. 


పోలవరం నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇచ్చింది. అదే మాదిరిగా కొత్త ప్రభుత్వం ఇస్తే పర్వాలేదు.  కానీ ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించింది. అందులోనూ ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి వివరణ లేదు. ఈ నేపథ్యంలో  ఇసుకను కొనుగోలు చేసే పరిస్థితి వస్తే అందుకు అదనంగా చెల్లింపులు జరపాలంటూ టెండర్ బిడ్ దాఖలు చేసిన కొత్త కాంట్రాక్టర్  స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. లేదా పాత విధానాన్నే అవలంభించాలంటూ లేఖలో పేర్కొంది. టెండర్ లో కూడా పాత కాంట్రాక్టర్ నవయుగ ఇంజినీరింగ్ కి వర్తించిన షరతులు వర్తింప చేయాలని ఉంది.


ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు 60 లక్షల టన్నుల ఇసుక అవసరం. ప్రభుత్వ ధర నిర్ణయం మేరకు తన్నుకు 368 రూపాయల చొప్పున 220 కోట్ల రూపాయలు అవుతుంది.  కానీ.. పచ్చ మీడియా మాత్రం ఆమాంతంగా తమ చేతి వాటాన్ని ప్రదర్శించి రూ. 500 కోట్లకు పెంచేసింది.ఇక టెండర్ లో పేర్కొన్న పనులను  12.6 శాతం తక్కువ ధరకు చేస్తామంటూ కొత్త కాంట్రాక్టర్  ఒక్కటే బిడ్ ను దాఖలు చేసింది. అలాగే టెండర్ లో పేర్కొనని పనులేవైనా సరే అదనపు చెల్లింపులు ప్రస్తుత ధరలకు అనుగుణంగా జరపడం అన్ని ప్రభుత్వం పనుల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ సహజం. 

మరింత సమాచారం తెలుసుకోండి: