మనది శాంతి మార్గం.  ఎక్కువగా మనం శాంతి మార్గంలోనే ఉండాలని కోరుకుంటాం.  అశాంతి పెరిగిపోయిన తరుణంలో తప్పించి ఎప్పుడు కూడా ఇండియా ఏ విషయంలోను ఎవరితోనూ గొడవ పెట్టుకోదు.  1948, 1971, 1999లో పాక్ ఇండియాపై దాడి చేసిన సమయంలో కూడా కొంతవరకు ఇండియా భూభాగం నుంచి పాక్ ను వెనక్కి తరిమిందిగాని... పాక్ లాగా ఆ దేశంలోకి వెళ్ళి దాడి చేయలేదు.  అలా చేయాలి అనుకుంటే.. ఇండియా ఎప్పుడో చేసేది. 


పాక్ గత ప్రధానులు కూడా ఇండియాతో కాస్త సౌమ్యంగానే ఉన్నారు.  కానీ ఇప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దూకుడు స్వభావం కలిగి ఉన్నాడు.  చీటికిమాటికి ఇండియాపై కాలుదువుతున్నారు.  పాక్ ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధిపధంలోకి తీసుకొస్తానని చెప్పిన ఇమ్రాన్, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు ఎక్కడా కనిపించలేదు.  పైగా ఇమ్రాన్ అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్ ఆర్ధికంగా మరింత చితికిపోయింది.  


ఇండియాలోని అంతర్గత విషయంగా ఉన్న కాశ్మీర్ ఇష్యూను అంర్జాతీయం చేసేందుకు ప్రయత్నం చేసింది.  ఆర్టికల్ 370 రద్దును పాక్ నిరసిస్తూ వచ్చింది.  రెచ్చగొటేలా వ్యాఖ్యలు చేసిన ఇమ్రాన్, అటు ఐరాసలో కూడా ఇదే విధంగా ప్రసంగం చేశారు.  కానీ, పాకిస్తాన్ కు ఏ దేశం కూడా మద్దతు ఇవ్వలేదు.  అంతేకాదు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా పేరు తెచ్చుకోవడంతో ఎఫ్ఏటిఎఫ్ సంస్థ పాక్ ను గ్రే లిస్టులో పెట్టింది.  


ఇక ఇదిలా ఉంటె, ఇమ్రాన్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ అక్కడి ప్రతిపక్షాలు సింధ్ ప్రావిన్స్ నుంచి అక్టోబర్ 27 న ఆజాదీ మార్చ్ పేరుతో మార్చ్ చేస్తూ నవంబర్ 1 వ తేదీన ఇస్లామాబాద్ చేరుకున్నారు.  ప్రతి పక్షాలన్నీ కూడా ఈ ఆజాది మార్చ్ కు మద్దతు పలికాయి.  ఇమ్రాన్ ఖాన్ అనుసరిస్తున్న విధానాలు సవ్యంగా లేవని, ఇమ్రాన్ ప్రధాని అయ్యాక దేశంలో ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ రిగ్గింగ్ చేసి గెలిచారని, 48 గంటల్లో ఇమ్రాన్ పదవికి రాజీనామా చేసి ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టడంతో ఇమ్రాన్ ఖాన్ ఆలోచనలో పడ్డాడు.  ఇప్పుడు ఇమ్రాన్ ముందు తన పదవిని కాపాడుకోవడం ఎలా అన్నది మాత్రమే ఉన్నది.  ముందు పదవిని కాపాడుకో ఇమ్రాన్ ఆ తరువాత కాశ్మీర్ గురించి ఆలోచించుదుగాని అంటూ నెటిజన్లు ఇమ్రాన్ పై సెటైర్లు వేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: