అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి  హత్య  పక్కాపథకం ప్రకారమే జరిగిందా ?, హత్య జరుగుతున్న సమయం లో తహశీల్ధార్ అఫీస్ బయట  కారులో ఉన్నది ఎవరు ?, హత్య చేసిన అనంతరం   వారితో నిందితుడు ఏమి మాట్లాడారన్నది ఇప్పుడు  హాట్ టాఫిక్ గా మారింది . విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన తరువాత నిందితుడు సురేష్ తాపీగా నడుచుకుంటూ వెళ్లి , తహశీల్ధార్ కార్యాలయ బయట వైన్ షాప్ వద్ద నిలిచి ఉన్న  కారు లో కూర్చున్న వారితో ఏదో మాట్లాడినట్లు సిసి టీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కన్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు .


 విజయారెడ్డి ని నిందితుడు పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు సంఘటన ముందు,  అనంతరం లభించిన ఆధారాలను పరిశీలించిన పోలీసులు చెబుతున్నారు . మరోవైపు విజయారెడ్డి హత్య రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది . సురేష్ అధికార పార్టీ కార్యకర్త అంటే కాదు ... కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటూ టీఆరెస్ , కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు . విజయారెడ్డి  హత్యతో టీఆరెస్ కు చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  అనుచరులకు సంబంధాలు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన  ఆరోపణలను మంచిరెడ్డి ఖండించారు .


నిందితుడు సురేష్ కుటుంబ సభ్యుల భూమిని  .. మల్ రెడ్డి రంగారెడ్డి అయన సోదరుడు మల్ రెడ్డి రాంరెడ్డి లు కొనుగోలు చేశారని , పాస్ బుక్ లు లేకుండానే తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు . తాను ఈ భూములు క్రమబద్దీకరించేందుకు రైతుల వద్ద 30  లక్షల రూపాయలు తీసుకున్నట్లు చేస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదని మంచిరెడ్డి అన్నారు . తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: