అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి సజీవ దహనం చేసిన కేసులో  ప్రధాన నిందితుడు సురేష్ ప్రాణాలకు తాము ఎటువంటి గ్యారంటీ ఇవ్వలేమని వైద్యులు తేల్చి చెప్పారు . విజయారెడ్డి పై పెట్రోలు పోసి నిప్పంటించిన నిందితుడికి కూడా మంటలు అంటుకుని 65 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రి లో పోలీసుల పర్యవేక్షణ లో చికిత్స పొందుతున్నాడు . యాభై శాతం కంటే తక్కువ గాయాలైన వారి ప్రాణాలకు మాత్రమే గ్యారంటీ ఇవ్వగలమని కానీ సురేష్ 65 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరారని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు .


 సురేష్ అమాయకుడని అతని భార్య లత చెబుతోంది . తన భర్త , తహశీల్ధార్ ను హత్య చేసేంత దారుణానికి ఒడిగడుతాడని భావించడం లేదని అన్నారు . ఈ హత్య వెనుక ఎవరో ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేసిన లత , తన భర్త ను పావుగా వాడుకున్నారని ఆరోపించింది . ఈ దారుణం వెనుక ఉన్న వారిని వెలికి తీయాలని ప్రభుత్వాన్ని , పోలీసులను లత కోరింది . వివాస్పద భూమికి సంబంధించిన పట్టా ఇవ్వలేదన్న కారణంగానే తహశీల్ధార్ ను హత్య చేసినట్లు సురేష్ తన వాంగ్మూలం లో పేర్కొన్నాడు . ఎన్నో రోజులుగా పట్టా ఇవ్వాలని కోరిన విజయారెడ్డి ఇవ్వకపోవడం వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెప్పుకొచ్చాడు .


అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం సురేష్ అమాయకుడని , అతను ఇంతటి దారుణానికి ఒడిగడుతాడని తాము భావిచడం లేదని అంటున్నారు . మరొకవైపు విజయారెడ్డి హత్య రాజకీయ రంగు పులుముకుంటోంది . ఈ ఘటన పై ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం తో కేసును పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . 


మరింత సమాచారం తెలుసుకోండి: