మనం ఈ రోజు అనుభవిస్తున్న అధికారాలు, స్వేచ్చా వాయువులు, హక్కులు అన్నీ కూడా మనకు ప్రసాదించింది మన ఘమైన భారత రాజ్యాంగం. ఈ దేశానికి స్వాతంత్రం రాగానే అప్పటి ప్రధాని బాబా సాహెబ్ అంబేద్కర్ తో పాటు ఎందతో ప్రముఖులను, మేధావులతో కూడిన రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి భారతీయులందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రచించమని కోరారు. ఆ విధంగా రెండున్నరేళ్ల పాటు సుదీర్ఘ వ్యయ ప్రయాసలకు ఓర్చి మనకు రాజ్యాంగం ఏర్పాటు చేశారు. 


అది 1949 సంవత్సరం. నవంబర్ 26న భారత  రాజ్యాంగాన్ని ఆమోదించింది భారత పార్లమెంట్. ఆ తరువాత దానిని జనవరి 1950 26 నుంచి అమలు చేస్తున్నారు. ఆ విధంగా చూసుకుంటే డెబ్బయ్యేళ్ల రాజ్యాంగం మనది ఇక్కడ పేదలు, పెద్దల‌కు ఒకే విధమైన హక్కులు కల్పించబడ్డాయి. ఈ దేశంలో లింగ బేధం లేకుండా, మరే వత్యాసాలు లేకుండా పౌరులందరూ ఒక్కటేనని చాటి చెబుతూ రాజ్యాంగం అందరికీ ఒక వరం ప్రసాదించింది.  అందువల్ల ఆ రోజున మహనీయులను, రాజ్యాంగ నిర్మాతలను గౌరవించుకుంటూ  మరో సారి దేశం కోసం అంకితం కావడమే ఈ ప్రత్యేక సమావేశం ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు.



ఆ విధంగా రాజ్యాంగానికి డెబ్బయ్యేళ్ళు నిండుతున్న సందర్భంగా భారత పార్లమెంట్ ఈ నెల 26న ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ఆ రోజున భారత ప్రధాని నరేంద్ర మోడీ, భారత రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సమావేశంలో భారత ఉప రాష్ట్రప‌తి ఎం వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎంపీలు, భారత మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు పాల్గొంటారు. ఇది గొప్ప కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ప్రతి భారత పౌరుడు ఆ రోజున దేశం కోసం తాము కూడా పునరంకితం అవుతామని ప్రమాణం చేస్తే దేశ మాతకు అంతకంటే కావాల్సినదేముంది.



మరింత సమాచారం తెలుసుకోండి: