ఏపీ సర్కారు ఇసుక కొరత విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒక రోజు నిరాహారదీక్షకు దిగుతున్నారు. ఇందు కోసం నవంబర్ 14 ను ముహూర్తంగా నిర్ణయించు కున్నారు. అయితే ఇసుక సమస్యపై తెలుగుదేశం పోరాటం ఇది కొత్త కాదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు దీక్షలు జరిపింది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఒకరోజు దీక్ష చేశారు.


ఆ తర్వాత ఇటీవలే పవన్ కల్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఒక రోజు దీక్ష చేస్తున్నారు. పోనీ ఇన్ని దీక్షలు చేసినా ఏమైనా ఫలితం ఉంటుందా అంటే.. నదుల్లో వరద ఉంటే మేమేం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ వాదనలోనూ వాస్తవం ఉంది. మరి అలాంటప్పుడు ఎన్ని దీక్షలు చేసినా రాజకీయ లబ్ది తప్ప ఒరిగేదేమీ ఉండదు.


అయితే ఈ విషయం చంద్రబాబుకు తెలియక కాదు. కానీ.. ఆయన చేతుల్లో మీడియా ఉంది. దాని ఆధారంగా నానాయాగీ చేయవచ్చన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోందంటున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు దొంగ దీక్షలను ప్రజలే తిప్పికొడతారని ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు. ఏ వర్గానికి అన్యాయం జరిగిందో చెప్పాలన్నారు.


ఎమ్మెల్యే జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్‌ 14వ తేదీన చంద్రబాబు దీక్ష చేస్తారంట.. బాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు ఎవరూ హర్షించరన్నారు. ప్రత్యేక హోదా కోసం దొంగ దీక్షలు చేశాడు.. ఆ దీక్షలను ఈసడించుకున్న ప్రజలు టీడీపీని 23 స్థానాలకు పరిమితం చేశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. బాబు చేసే దొంగ దీక్షలను ప్రజలే తిప్పికొడతారన్నారు. పిచ్చి వాళ్లలా పవన్, చంద్రబాబు ప్రవర్తించవద్దని హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: