ఆంధ్ర ప్రదేశ్ లో  ప్ర‌తిభ గ‌ల విద్యార్ధుల‌కు మాజీ రాష్ట్ర‌ప‌తి అబ్దుల్ కలాం పేరిట ప్ర‌తిభ పురష్కారాలు అంద‌జేస్తున్న విష‌యం అంద‌రికీ తెలుసు. అయితే ఈ కార్య‌క్ర‌మానికి వైయ‌స్సార్ ప్ర‌తిభ పుర‌ష్కారాలుగా అధికారులు పేరు మారుస్తూ తాజాగా జీవో జారీ చేయ‌డం గ‌మ‌నార్హం. ముఖ్య‌మైన కార్య‌క్ర‌మానికి ఓ మ‌హ‌నీయుడి పేరును మార్చడంతో ఒక్క‌సారిగా ఈ జీవో అంశం ఏపీలో పెద్ద రచ్చ‌గా మారింది. 


దీంతో విష‌యం తెలుసుకున్న ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఈ వ్య‌వహారంపై సీరియ‌స్ గా స్పందించారు.  ప్ర‌తిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీవోను రద్దు చేయాలని జ‌గ‌న్ ఆదేశించారు. ప్రతిభా పురస్కారాలకు యథాతథంగా అబ్దుల్‌ కలాం పేరునే పెట్టాలని అధికారులకు సూచించారు.

ఇక్క‌డ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే... ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రికి తెలియ‌కుండా ప్ర‌భుత్వ అధికారులు ఈ జీవోను ఎలా జారీ చేశార‌నే విష‌యం పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. అంత‌లా ప్ర‌భుత్వ అధికారుల‌ను ఎవ‌రైనా  తెర వెనుక ప్ర‌భావితం చేస్తున్నారా...? అనే అనుమానాల‌ను కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులు జారీ చేసిన ఈ జీవో సోష‌ల్ మీడియా, న్యూస్ చాన‌ల్స్ లో ఒక్కసారిగా వైర‌ల్ అయింది. 


అబ్దుల్ క‌లాం లాంటి మ‌హోన్న‌త వ్య‌క్తి పేరును ప్ర‌భుత్వం తీసివేయ‌డం దారుణ‌మంటూ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుతో పాటు ప‌లువురు ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దీంతో వెంట‌నే త‌ప్పును గ్ర‌హించి ఈ జీవోను వెన‌క్కు తీసుకునేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. కొందరు విమర్శకులు సీఎం కి తెలియకుండానే జీవో జారీ చేసారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే నమ్మండి.ఇవ్వనికి కూడా ముఖ్య‌మంత్రికి తెలియకుండానె ఎలా జరుగుతాయి అని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.  ఇంతకీ జీవోను వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: