ఆర్టీసీ కార్మికులు  చేస్తున్న సమ్మె నేటితో 34 వ రోజుకు చేరుకుంది.  గత 34 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఈ సమ్మెల కారణంగా ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి.  బస్సులు ఆగిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.  ప్రయాణికులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మె విషయాన్నీ వీలైనంత త్వరగా ఓ కొలిక్కి తీసుకురావాలని ప్రజలు వేడుకుంటున్నారు.  అయితే, సమ్మె విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.  


డెడ్ లైన్లు విధించినా సమ్మె చేస్తున్న కార్మికులు విధుల్లోకి రాలేదు కాబట్టి, రాష్ట్రంలో 5100 రూట్లకు ప్రైవేట్ బస్సులను పర్మిట్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ను దాఖలు చేసింది.  ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని.  అన్ని చెల్లించకని చెప్తున్నది. అదనంగా రూ. 504 కోట్లు కూడా చెల్లించామని, అవి ఆర్టీసీ నుంచి ప్రభుత్వానికి రావాల్సి ఉందని చెప్పింది. 


దీనిపై నేడు హైకోర్టులో వాదనలు జరగబోతున్నాయి.  ఈ వాదనల్లో ఎంతవరకు బలం ఉందని తేలబోతున్నది.  ఒకవేళ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఎలాంటి బాకీలు లేకుంటే ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో నడుస్తున్నది.  నష్టాలకు కారణం ఎవరు అనే కోణంలో హైకోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.  ఏది ఏమైనా ఈరోజు హైకోర్టులో జరిగే వాదనలతో ఆర్టీసీ సమ్మె ఒక కొలిక్కి రావొచ్చని తెలుస్తోంది.  


ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేరాలని కోర్టు ఆదేశిస్తుందా లేదంటే.. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ లోని లెక్కలు గురించి ఆరాతీస్తోందా చూడాలి.  ఈరోజు కోర్టులో వాదనలు ఉన్నాయి కాబట్టి రేపటి రోజున ఈ ప్రైవేట్ రూట్లకు సంబంధించిన పర్మిట్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నది రేపు తేలిపోతుంది.  ఒకవేళ పర్మిట్లు ఇస్తే ఎలాంటి పర్మిట్లు ఇవ్వబోతున్నారు.  ఎలా ఇస్తారు అన్నది కూడా రేపు తేలుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: