పవన్ కళ్యాణ్ ఏ భహిరంగ సభ చూసినా జగన్ తో పాటు మంత్రి కురసాల కన్నబాబును కూడా విమర్శిస్తుంటారు. మిగతా వైసీపీ నాయకులను వదిలేసినా కన్నబాబును మాత్రం పవన్ నిత్యం టార్గెట్ చేస్తుంటారు. దీనికి కారణం ఏంటంటే .. చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన కన్నబాబు.. ప్రజారాజ్యాన్ని చిరంజీవి కాంగ్రెస్లోవిలీనం చేసేలా తప్పుడు గైడెన్స్ ఇచ్చారని పవన్ బలంగా నమ్ముతున్నారట. అన్న చిరంజీవి తన మాట వినకుండా కన్నబాబు మాట విని పార్టీని కాంగ్రెస్లో కలిపారని.. ఆ పార్టీయే ఉంటే ఈ సరికి తమ కుటుంబానికి సీఎం పదవి దక్కేదని పవన్ తన సన్నిహితుల వద్ద అంటుంటారట. అయితే ఇప్పుడు ఏపీలో కన్నబాబు  పవన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే సాగుతుంది. నిన్న కన్నబాబు ప్రెస్ మీట్ పెట్టి పవన్ మీద విరుచుకుపడిన సంగతీ తెలిసిందే. 


పవన్ కళ్యాణ్ తన సభలో ఆవేశంతో ఊగిపోయి వైసీపీనాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మాములు అయిపొయింది. జనాల సమస్యల గురించి మాట్లాడకుండా వ్యక్తిగతంగా తిట్టడానికే పవన్సమయాన్ని కేటాయిస్తున్నారు. అయితే మొన్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ .. కన్నబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతీ తెలిసిందే. దీనితో కన్నబాబు పదునైన ప్రశ్నలతో పవన్ కు సవాలు విసిరారు. మంగళవారం తన సొంతూరు కాకినాడలో మీడియా ముందుకు వచ్చిన కన్నబాబు... పీకేను నిజంగానే కడిగిపారేశారనే చెప్పాలి.


ఓ రేంజిలో కన్నబాబు వదిలిన బాణాల్లాంటి మాటలకు అసలు పీకే నుంచి రిప్లై వచ్చే అవకాశాలే లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.  ఇంతకు కన్నబాబు పవన్ మీద చేసిన విమర్శలను గమనిస్తే ..  ‘భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేసిన టీడీపీతో కలిసి లాంగ్ మార్చ్ చేసిన పవన్ కు ఇసుక కొరతపై మాట్లాడే హక్కే లేదు. ఒక్క సీటుకే ఇంత హడావిడి చేస్తున్న పవన్ ... ఇంకా కొన్ని సీట్లు వస్తే పరిస్థితి ఎలా ఉండేదో? రాజకీయాల్లోకి వస్తున్నానంటూ సినిమాలు వదిలేసి వచ్చానని చెబుతున్న పవన్... యాక్టింగ్ మాత్రం మానుకోలేదని విమర్శించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: