ఎన్నికల పలితాలొచ్చి వారాలు గడుస్తున్న ఎన్ డి ఏ ప్రధాన భాగస్వాములైన బీజేపి శివసేన మద్య అధికార పంపకం కోసం హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ నడిచాయి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో శివసేన దురాశ ప్రస్పుటంగా కనిపిస్తున్నా మహారాష్ట్ర రాజకీయాలపై దాని పట్టు తక్కువేమీ కాదు. అయితే ప్రస్తుతానికి మాత్రం కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి తొలిగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరేందుకు బీజేపీ నేతలు గురువారం (నేడు) రాష్ట్ర గవర్నర్‌ను కలువనున్నారు. శివసేనకు మద్దతునిచ్చే ప్రసక్తే లేదని, తాము ప్రతిపక్షంలోనే కూర్చుంటామని ఎన్సీపీ స్పష్టం చేసింది. 

సీఎం పదవిని చెరో రెండున్నరేండ్లపాటు పంచుకోవాలని ప్రతిపాదిస్తున్న శివసేన, బీజేపీ నుంచి తమకు ఇంకా ఎటువంటి స్పందన లభించలేదని చెబుతున్నది. పూర్వ శాసనసభ  గడువు ఇంకా రెండు రోజుల్లో ముగియనుండ దరిమిలా ఆ తరువాత మూడు రోజుల పాటు శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆ సమయం లోనే కొత్త శాసనసభ్యులు  ప్రమాణాస్వీకారం చేయవలసి ఉంటుంది.
Maharashtra <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GOVERNMENT' target='_blank' title='government-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>government</a> Formation LIVE Updates: 'No Need For Fresh Talks' With <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BHARATIYA JANATA PARTY' target='_blank' title='bjp-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bjp</a>, Says Shiv Sena's Sanjay Raut
బీజేపీ-శివసేన మధ్య ఏర్పడిన ప్రతిష్ఠంభనకు త్వరలోనే పరిష్కారం లభించనుందని, ఈ నెల 9 లోపు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయావర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య తెర వెనుక చర్చలు జోరుగా సాగుతున్నాయని విశ్వసనీయ వర్గాల కథనం. అయితే ప్రభుత్వంలో భాగస్వామ్యం కోసం శివసేనకు, బీజేపీ ఏమి ఇవ్వబోతున్నదన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

సీఎం పదవి విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని బీజేపీకి చెందిన సీనియర్‌ నేత పునరుద్ఘాటించారు. సీఎం పదవితోపాటు మంత్రులకు లభించే శాఖల విషయంలో బీజేపీ, శివసేన మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న సంగతి తెలిసిందే. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలు గెలుచుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, 56 సీట్లను గెలుచుకొని శివసేన రెండో స్థానంలో నిలిచింది. ఈ రెండు పార్టీలు ఒకకూటమిగా ఎన్నికల్లో పోటీచేశాయి. ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో గెలిస్తే సీఎం పదవిని చెరో రెండున్నర సంవత్సరాలపాటు చేపట్టాల ని బీజేపీ వాగ్దానం చేసిందని, ఆ ప్రకారం ముఖ్యమంత్రి పదవిని ముందుగా తమకు ఇవ్వాలని శివసేన డిమాండ్‌ చేస్తున్నది.

ప్రజలు తమకు, తమ మిత్రపక్షం కాంగ్రెస్‌కు ప్రతిపక్షంలో కూర్చోవాలని మాత్రమే తీర్పు ఇచ్చారని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ పేర్కొన్నారు. బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. ఆ రెండు పార్టీలు త్వరగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, తాము బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని తెలిపారు. శివసేన నేత సంజయ్‌ రౌత్‌తో భేటీ అనంతరం శరద్‌పవార్‌ విలేకరులతో మాట్లాడుతూ, ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వంలో తాము చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఎన్సీపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, దానికి కాంగ్రెస్‌ బయటి నుంచి మద్దతునిస్తుందని కొద్దిరోజులుగా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై శరద్‌ పవార్‌ స్పందిస్తూ, "బీజేపీ లేని ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందా? బీజేపీ, శివసేన గత 25సంవత్సరాల పాటు కలిసే ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే త్వరలో ఆ రెండు పార్టీలు మళ్లీ కలుస్తాయి. మాకు మెజార్జీ వచ్చి ఉంటే, మేమెవరి కోసమూ నిరీక్షించం. కాంగ్రెస్‌, ఎన్సీపీకి కలిపి 100 సీట్లు కూడా దాట లేదు. మేం బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం’ అని అన్నారు. 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SHIV SENA PARTY' target='_blank' title='shiv sena-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>shiv sena</a> & <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BHARATIYA JANATA PARTY' target='_blank' title='bjp-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bjp</a> govt in maharashtra

మరింత సమాచారం తెలుసుకోండి: