మనదేశంలో జనాభా భారీగా పెరిగిపోతున్నది.  ఇప్పటికే 130 కోట్లకు పైగా పెరిగిపోయింది.  ఈ సంఖ్య ఇలానే పెరిగితే... చైనాను మించిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అటు ప్రపంచ జనాభా కూడా సగటున పెరుగుతూనే ఉన్నది.  కొన్ని దేశాల్లో మాత్రం అక్కడి జనాభా వృద్ధి రేటు దారుణంగా ఉంటోంది.  ఆయా దేశాలు బాబోయ్ పిల్లల్ని కనండి ... దేశంలో యువకుల సంఖ్య తగ్గిపోతున్నది.  ఈ సంఖ్య తగ్గిపోతే.. భవిష్యత్తులో యువకులు కనిపించరు అని మొత్తుకుంటోంది.  


అంతేకాదు, డేటింగ్ చేయాలి అనుకునే వాళ్లకు అక్కడి ప్రభుత్వం సెలవులు కూడా మంజూరు చేస్తోంది.  అవసరం అనుకుంటే లీవ్ లతో పాటు లోన్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందట.  ఇంతకీ ఎక్కడ  అని అనుకుంటున్నారా... అక్కడికే వస్తున్నా.. జనాభా వృద్ధి రేటు తక్కువగా ఉన్న దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి.  ఈ దేశం ఆర్ధికంగా, టెక్నాలజీ పరంగా బాగా అభివృద్ధి చెందింది.  


ప్రజలు నిత్యం పనులు చేయడానికి అలవాటు పడ్డారు.  ఇది అక్కడి ప్రభుత్వానికి శాపంగా మారింది.  ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా జనాభా పెరగడం లేదు.  జనాభాను పెంచే మార్గాల కోసం అన్వేషిస్తోంది.  యువకుల సంఖ్యా దారుణంగా పడిపోయింది. ఇది అక్కడి ప్రభుత్వానికి కలవరపెడుతుంది.  ఏ దేశంలో అయితే యువకులు ఎక్కువగా ఉంటారో ఆదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది.  


కానీ, దక్షిణ కొరియాలో మాత్రం ముసలివాళ్లు సంఖ్య నానాటికి పెరుగుతుండటం ఆ దేశాన్ని బాధిస్తోంది.  డేటింగ్ చేసే ఆలోచన ఉన్న వాళ్ళను ప్రోత్సహిస్తోంది.  వారికీ లీవ్ లు మంజూరు చేస్తూ అవసరమైతే డబ్బులు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నది.  మరో 20 ఏళ్లలో యువకుల సంఖ్యా పెరగకపోతే.. దేశం అల్లకల్లోలంగా మారిపోవడం ఖాయం.  ముసలివాళ్ళతో దేశం నిండిపోతుంది.  ఫలితంగా అన్ని రంగాల్లో కుంటుపడే అవకాశం ఉన్నది.  అందుకే కొరియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: