మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని సంగతీ తెలిసిందే. బీజేపీ   శివసేన కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చినా వారి మధ్య సీఎం కుర్చీ కోసం యుద్ధం మొదలైంది. రెండు పార్టీల మధ్య ఇప్పటి వరకు మాటల యుద్ధం కొనసాగింది. అయితే శరద్ పవార్ శివసేనకు మద్దతు ఇచ్చేది లేదని చెప్పడంతో మహా సంక్షోభం ఓకే కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. పవర్ షేరింగ్ పై చేరో వాదన వినిపిస్తూ...అ అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్న బీజేపీ శివసేనల మధ్య తొలి కీలక భేటీ జరిగింది. శివసేనకు ఆరుగురు కీలక నేతలు మొన్నటిదాకా ఫడ్నవీస్ కేబినెట్ లో మంత్రులుగా కొనసాగిన నేతలు ఫడ్నవీస్ తో భేటీ అయ్యారు. మహారాష్ట్ర రైతాంగం సంక్షోభం పై చర్చించడానికి శివసేన నేతలను స్వయంగా ఫడ్నవీసే ఆహ్వానించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 


అయితే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును ఒక కొలిక్కి తెచ్చేందుకే ఈ భేటీ అని మాటలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు నిజమేనన్నట్లుగా ఈ భేటీలో రైతాంగం సంక్షోభంతో పాటు ప్రభుత్వ ఏర్పాటు పై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన కీలక నేత ఎమ్మెల్యే సుధీర్ ముంగటివార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బీజేపీ నుంచి శివసేనను ఎవ్వరూ వేరుచేయలేరు. ఇద్దరమూ కలిసే ఉన్నాం. మేము మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నామని చెప్పడంతో రెండు పార్టీలు ఏకాభిప్రాయానికి రావొచ్చని తెలుస్తుంది. 


అయితే ముంగటివార్ ఇంకా చెబుతూ శుభవార్త ఏ క్షణంలోనైనా రావొచ్చని చెప్పడంతో ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం అయ్యిందని చెప్పాలి.  మొన్నటిదాకా శివసేన తమ దారికి రాకుంటే... రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ముంగటివార్... ఇప్పుడు ఏకంగా శివసేనతో తమకు ఎలాంటి విభేదాలు లేవని ఇరు పార్టీల ఆధ్వర్యంలోనే కొత్త ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని చెప్పడం చూస్తుంటే... మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెర పడినట్టేనన్న వాదన వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: