అయోధ్య తీర్పు మరికొన్ని రోజుల్లో బయటకు రాబోతున్నది.  ఈ తీర్పు ఎలా ఉంటుంది.. ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనే దానిచుట్టునే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి.  ఇక అయోధ్య విషయంలో ఎవరూ కూడా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయరాదని హెచ్చరికలు జారీ చేసింది.  ఈ హెచ్చరికల నేపథ్యంలో నిఘాను పెంచారు.  సోషల్ మీడియాపై నిఘాను కట్టుదిట్టం చేశారు.  


యూపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటోంది.  అయోధ్యలో ఇప్పటికే నాలుగంచెల భద్రతను ఏర్పాటు చేసింది.  భద్రత విషయంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.  ఎవరూ కూడా ఆ రోజున విగ్రహాలును స్థాపించడం గాని, ఊరేగింపులు చేయడం కానీ చేయకూడదని హెచ్చరించింది.  అయోధ్యలో విధ్వంసం సృష్టించేందుకు కొందరు ముష్కరులు ప్రవేశించారనే వార్తలు రావడంతో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటోంది. 


ఇక ఇదిలా ఉంటె, అయోధ్య విషయంపై ప్రధాని మాట్లాడతారు.  సుప్రీం కోర్టు తీర్పు వస్తున్న నేపథ్యంలో మంత్రులు ఎవరూ అయోధ్య విషయంలో మాట్లాడతారని, ఈ తీర్పు  దేనికి అనుకూలంగా, దేనికి కాదు అనే మాట మాట్లాడకూడదని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దని హెచ్చరించారు.  పీఎంవో కార్యాలయం కూడా దీనిపై నిఘా పెట్టింది.  అటు ఢిల్లీ పొల్యూషన్ పై కూడా ప్రధాని మాట్లాడారు.  


ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని పంట వ్యర్ధాలను కాల్చకుండా చూడాలని, పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు అవసరమైన యంత్రాలను వెంటనే అందించాలని కేంద్ర వ్యవసాయ శాఖను ఆదేశించారు. ఇన్‌ ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధారిత మల్టీమోడల్‌ ప్లాట్‌ఫాం ‘ప్రగతి’ 31వ సమావేశాల్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ప్రధాన మంత్రి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ పీకే మిశ్రా రోజూవారీగా నమోదవుతున్న కాలుష్యస్థాయిని సమీక్షిస్తున్నారని తెలిపింది. ఇవే కాకుండా అనేక ప్రోజెక్టుల గురించి ఈ సమావేశంలో మోడీ చర్చించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: