రాజధానిపై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడుతుందన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రకటన చేస్తుందన్నారు. వైసీపి అధికార పగ్గాలు చేపట్టాక అమరావతి నిర్మాణ పనులు ఎక్కడివక్కడ ఆగిపోయి మొత్తం రాజధాని అమరావతి నిర్మాణానికే బ్రేక్ పడింది. అమరావతి నిర్మాణం ఆర్భాటంగా ప్రారంభించిన సింగపూర్ నిర్మాణ సంస్థలు  తిరుగు ముఖం పట్టాయి. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనలతో, రాజధాని నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 
Image result for amaravati
తాజాగా రాజధానిపై బొత్స చేసిన కీలక వ్యాఖ్యలు మొత్తం ర్ఫాజధాని నిర్మాణాన్నే గందరగోళంలో పడేశాయి. నిపుణుల కమిటీ 13 జిల్లాల్లో పర్యటిస్తోందని, ఆ కమిటీ నివేదిక అనంతరం మాత్రమే, రాజధానిపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేస్తుందని తెలిపారు. ఫలానా తేదీ లోగా అని స్పష్టంగా చెప్పనప్పటికీ, త్వరలోనే ఆ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. నిపుణుల కమిటీ నివేదిక సమర్పించటానికి ప్రభుత్వం ఆరువారాల గడువు ఇచ్చిందన్నారు.

నిపుణుల కమిటీ తనకు నిర్దేశించిన సూచనల ప్రకారం  "ఏ భవనం ఎక్కడ ఉండాలో"  నిర్ణయిస్తామన్నారు. గత ఐదేళ్లలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిపై కనీసం "ప్రభుత్వ రాజపత్రం-గెజిట్" కూడా విడుదల చేయలేదని దాని ఫలితంగానే అది "అమరావతి ఒక తాత్కాలిక రాజధాని" అనే భావన ప్రజల్లో ఉందన్నారు. అమరావతిలో గత ప్రభుత్వం చూపించిన 'గ్రాఫిక్స్ ఆకృతులు'  తప్ప నిజమైన శాశ్వత నిర్మాణాలు లేవన్నారు. దృశ్యాలు, పత్రికలు టివి తెరలపై తప్ప భువిపై లేవని, భ్రమలో మాత్రమే అమరావతిని దర్శించగలమనే భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది.  
Related image
రాజధాని నిర్మాణం కోసం ₹ 5400 కోట్లు ఖర్చయిందని, 90 శాతం పనులు పూర్తయినట్టు ఏ నిపుణుడితోనైనా చెప్పించండని మంత్రి బొత్స టీడీపీ నేతలను చాలంజ్ చేశారు.  శాసనసభ్యుల భవనాలు 67 శాతం, ఐఏఎస్ అధికారుల భవనాలు 26 శాతం మాత్రమే పూర్తయ్యాయని శాసన సభ్యుల, ఎన్జీవోల, ఐఏఎస్ అధికారుల భవనాలు తప్ప  మిగిలినవన్నీ "తాత్కాలిక భవనాలు" మాత్రమే మంత్రి బొత్స స్పష్టం చేశారు.

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా "శాశ్విత రాజధాని" పై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని బొత్స చెప్పడం ద్వారా, రాజధాని మార్పు ఖాయమే! అన్నట్లు ప్రతి ఒక్కరిలో జనిస్తుందని, రాజధానిని అమరావతిలోనే ఉంచినా, కూడా రాజధాని వికేంద్రీకరణకు వైఎస్ జగన్మోహనరెడ్డి నాయకత్వంలోని వైసీపి ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. 

Image result for Botsa comments on Amaravati

మరింత సమాచారం తెలుసుకోండి: