ఇప్పుడు మనిషిని పక్కనున్న మనిషి కంటే చేతిలో ఉన్న బుల్లి సెల్ ఫోన్ ముఖ్యమైపోయింది.  సెల్ ఫోన్ కారణంగా మనిషి పక్కనున్న మనిషితో మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు.  మనిషికి మనీ, ఫోన్ ముఖ్యమైపోయాయి.  రోజంతా ఆఫీస్ లో కష్టపడటం... ఉదయం, సాయంత్రం సమయాల్లో సెల్ ఫోన్ తో కాలక్షేపం చేయడం ఇదే జీవితం అయ్యింది.  మరో వ్యాపకం లేకపోవడంతో ఇంట్లో పిల్లలు ఎలా ఉంటున్నారు.. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయాలను పట్టించుకోవడం లేదు.  


పిల్లల గురించి తల్లిదండ్రులు కనీసం రోజులో కొంతసమయం అయినా కేటాయించాలి.  కొంతసమయం కేటాయిస్తేనే.. పిల్లలు సక్రమంగా ఉంటారని, మంచి మార్గంలో నడుస్తారని అంటున్నారు.  పిల్లల గురించి తల్లిదండ్రులు పట్టించుకోవాలని కోరుకుంటూ తమిళనాడు ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  నవంబర్ 14 వ తేదీన ఉదయం 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పిల్లలతో మాట్లాడాలని, వారి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని ఆదేశించింది.  


దీనిని కనీసం వారంలో ఒక్కరోజైనా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించేందుకు సిద్ధం అవుతున్నది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందించదగినదే.  అందులో సందేహం అవసరం లేదు.  అయితే, ఇది ఎంతవరకు అమలు జరుగుతుంది అన్నది తెలియాలి.  పిల్లలతో మాట్లాడాలా వద్దా అన్నది తల్లిదండ్రుల నిర్ణయం. 

మా ఇష్టం మేము మాట్లాడితే మాట్లాడతం లేదంటే లేదు అని చెప్పేస్తుంటారు.  ఇలా చేయడం వలన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలు జరగదు.  ఇది అమలు జరగాలి అంటే ముందు తల్లిదండ్రుల్లో అవగాహనా తీసుకురావాలి.  దానికోసం కొంతమంది వాలంటీర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి కొన్నిరకాల కొన్నిరకాల ప్రోగ్రామ్ లు కండక్ట్ చేయాలి.  మొదట పిల్లల గురించిన అవగాహనను తల్లిదండ్రుల్లో తీసుకొచ్చినపుడే ఇది సాధ్యం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: