జగన్ మంచితనాన్ని కొందరు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారా? ఏపీ ముఖ్యమంత్రి ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు వీలుగా కొత్తతరహా కుట్రలకు తెర తీస్తున్నారా? పాలనాపరమైన అంశాల్లో అధికారులకు ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకొని ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెస్తున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇందుకు నిదర్శనంగా చెప్పక తప్పదు.  పాలనను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా అధికారులకు స్వేచ్ఛను ఇవ్వటం.. కొన్ని నిర్ణయాల్ని వారి విచక్షణకు వదిలేయటం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతోంది.


అధినేతకు తెలీకుండా వివాదాస్పద నిర్ణయాల్ని తీసుకొని విమర్శలకు అవకాశం ఇచ్చేలా కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పదో తరగతి ప్రతిభావంతులకు ప్రతి ఏడాది ఇచ్చే అబ్దుల్ కలాం పురస్కారాలకు పేరు మారుస్తూ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అబ్దుల్ కలాం పేరుతో ఉన్న పురస్కారాన్ని వైఎస్సార్ పేరుతో అందించాలన్న సరికొత్త నిర్ణయాన్ని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వుల రూపంలో ఆదేశాలు జారీ చేసింది.


దీనిపై సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణమైంది. కలాం పేరును మారుస్తారా? అన్నది సంచలనంగా మారింది. ఈ అంశంపై సీఎం జగన్ స్పందించారు. షాకింగ్ అంశం ఏమంటే.. ముఖ్యమంత్రికి తెలీకుండా ప్రతిభా పురస్కారాల పేరు మార్చిన వైనాన్ని ఆయన వెల్లడించారు. తనతో చర్చించకుండా తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వెంటనే జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఉత్తర్వును రద్దు చేయాలని ఆదేశించారు.


ఎప్పటిలానే పురస్కారాల్ని అబ్దుల్ కలాం పేరుతోనే ఉంచాలని చెప్పారు. తనకు తెలీకుండా తీసుకున్న నిర్ణయాన్ని వెనువెంటనే ఖండించటమే కాదు.. ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఏ ఉద్దేశంతో తీసుకున్నారన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. చూస్తుంటే.. పాలనా పరమైన అంశాల్లో సీఎం జగన్ ఇచ్చిన స్వేచ్ఛను కొందరు అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారన్న విమర్శ వినిపిస్తోంది. బీ అలెర్ట్ జగన్. 


మరింత సమాచారం తెలుసుకోండి: