ఐసిస్ చీఫ్ బాగ్దాదీని ఇటీవల అమెరికన్ సైన్యం మట్టుపెట్టింది.  దీంతో ఐసిస్ ప్రాబల్యం తగ్గిపోతుందని అనుకున్నారు.  కానీ. ప్రపంచంలో చాలా దేశాల్లో ఐసిస్ చొచ్చుకుపోయి ఉన్నది.  దీంతో దాని మూలలను తెలుసుకొని ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నదో అక్కడ దాన్ని అంతమొందించేందుకుఆయా దేశాలు సిద్ధం అవుతున్నాయి.  ఇటీవలే మాలిలో ఐసిస్ తీవ్రవాదులు రెచ్చిపోయి దాడులు చేశారు.  ఈ దాడుల్లో 53 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే.  


ఇక ఇదిలా ఉంటె, ఐసిస్ సోషల్ మీడియా సంస్థ ఇప్పుడు కొత్త ప్రచారాన్ని ఎత్తుకుంది.  అడవులను లక్ష్యంగా చేసుకోవాలని చూస్తోంది . అడవులను లక్ష్యంగా చేసుకోవడం అంటే.. అక్కడ ఉండి పోరాటం చేయడం కాదు.. అడవులను తగలబెట్టడం.  ఇటీవల అమెజాన్ రైన్ ఫారెస్ట్ మంటల్లో చిక్కుకున్నప్పుడు ప్రజలు విలవిలలాడిపోయారు.  ప్రపంచానికి 20శాతం ఆక్సిజన్ ఆ అడవుల నుంచే వస్తుంది.  


అమెజాన్ అడవుల్లో ఎంచుకున్న కార్చిచ్చు కారణంగా ఎన్నో వేల చెట్లు అగ్నిని ఆహుతయ్యాయి.  ప్రాణ వాయువు స్థానంలో ప్రాణాలను హరించే కార్బన్ మోనాక్సయిడ్ వంటివి విడుదలయ్యాయి.  ఈ వాయువుల కారణంగా ఎన్నో జంతువులు, అడవికి చుట్టుపక్కల ఉన్న మనుషులు బలిఅయ్యారు.  అదే విధంగా కాలిఫోర్నియా అడవుల్లో రేగిన కార్చిచ్చు కారణంగా అమెరికా ప్రజలు గగ్గోలు పెట్టారు.  సెలెబ్రిటీ ఇల్లు సైతం ఈ మంటల్లో ఆహుతి అయ్యాయి.  


పర్యావరణం సమతుల్యత లేకుంటే... ముప్పు వస్తున్నదని, పర్యవరణాన్ని కాపాడాలని ప్రపంచ దేశాలు ఘోషిస్తున్నాయి.  దీనికి వ్యతిరేకంగా ఐసిస్ పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నది.  అమెరికా, ఫ్రాన్స్, యూకే, యూరప్ దేశాల్లో ఉన్న అడవులను లక్ష్యంగా చేసుకొని మంటలు పెట్టాలని చూస్తున్నది.  ఇదే జరిగితే.. పర్వావారణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐసిస్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనించి ఆయా ప్రభుత్వాలు వాటిని అడ్డుకుంటే మనిషి మనుగడ సాగిస్తాడు.   


మరింత సమాచారం తెలుసుకోండి: