జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విశాఖలో జరిగిన సభలో మంత్రి కన్నబాబు టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఎన్నికల సమయంలోనూ కన్నబాబును టార్గెట్ చేసుకొని ఆయనను ఓడించాలని ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పిలుపునిచ్చారు. అదీకాకుండా గంటా శ్రీనివాస రావుపై కూడా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు చేసారు. అందుకే జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్‌లో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు పాల్గొన్నప్పటికీ.. గంటా మాత్రం కనిపించలేదంటున్నారు. వాస్తవానికి ప్రజారాజ్యం తరఫున కన్నబాబు, గంటా శ్రీనివాస రావు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అదీగాక వీరిద్దరు కాపు సామాజిక వర్గానికే చెందిన వారు అందుకే చిరంజీవికి ఆప్తులుగా వీరిద్దరు మారారు.


ఇకపోతే కొన్నాళ్లుగా చిరంజీవి రాజకీయాలకు దూరమైనప్పటికీ.. గంటా, కన్నబాబు ఇద్దరూ చిరుతో టచ్‌లోనే ఉన్నారు. ఇక వీరంటే చిరంజీవికి కూడా అభిమానమే. అందుకే ఇటీవల కన్నబాబు సోదరుడు చనిపోయినప్పుడు.. చిరంజీవి కాకినాడ వెళ్లి ఆయన్ను పరామర్శించి వచ్చారు కూడా. ఇకపోతే ఇక గంటా శ్రీనివాస రావు సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన మంత్రిగా టీడీపీలో కొనసాగుతున్నప్పటికి చంద్రబాబు ఏమనుకుంటారనే బెరుకు కూడా లేకుండా అప్పటికి ఇప్పటికి చిరంజీవితో సన్నిహితంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన ఎస్వీ రంగారావు విగ్రహావిష్కరణ వేడుకలోనూ మెగాస్టార్‌తో కలిసి గంటా పాల్గొన్నారు.


అదీకాకుండా చిరంజీవి, అల్లు అరవింద్ వైజాగ్ వెళ్లినా లేక అక్కడ ఏదైనా మెగా హీరోల సినిమా ఫంక్షన్లు జరిగినా  గంటా శ్రీనివాస రావు అన్నీ తానై చూసుకుంటారు. కానీ కన్నబాబు, గంటా శ్రీనివాస రావు పేర్లు చెబితే చాలు పవన్ కళ్యాణ్ ఎగిరెగిరి పడతారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవేమంటే పార్టీ ఎదుగుదలకు సహకరించాల్సిన కన్నబాబు మాయ మాటలు చెప్పి ఎమ్మెల్యే సీటు పొందాడని, అదీగాక ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా వీరిద్దరూ ప్రోత్సహించారనే విషయాన్ని జనసేనాని బలంగా నమ్ముతున్నారనే వాదన కూడా ఉంది.


ఒకవేళ పవన్ ఆలోచనే నిజమనుకుంటే చిరంజీవి కూడా వీరిద్దరిని విమర్శించాలి. అలా కాదనుకుంటే.. చిరు స్వతహాగా సౌమ్యుడు కాబట్టి.. వారిని దూరం పెట్టాలి. కానీ ఇప్పటికీ ఆయనకు వారితో సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు జనసేనాని వారిని టార్గెట్ చేస్తూ ఎందుకు విమర్శలు చేస్తున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.. ఏది ఏమైన రాజకీయరంగులు ఎంతకు అర్ధం కావనుకుంటున్నారు ఈ విషయాలను ఆలోచించినవారు కొందరు..


మరింత సమాచారం తెలుసుకోండి: