రేపు శనివారంతో మహారాష్ట్ర ప్రభుత్వం గడువు ముగుస్తుంది.  ఈ గడువు తరువాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.  ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే.. దాని వలన అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నది.  శివసేన మాత్రం తమకు ముఖ్యమంత్రి పీఠంలో భాగం ఇస్తేనే మద్దతు ఇస్తామని చెప్తున్నది.  శివసేన ఎమ్మెల్యే రౌత్ తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటున్నాడు.  


దీనిపై క్షుణంగా పరిశీలనా చేస్తే.. శివసేనకు అంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి వచ్చారు..అన్నది డౌట్.  శివసేనకు ఒక్క ఎన్సీపీ మద్దతు ఇస్తే సరిపోదు.  ఎన్సీపీ మద్దతుతో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వాలి.  అలా ఇస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది.  అయితే, కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి శివసేనకు మద్దతు ఇచ్చి.. ఆ పార్టీ అభ్యర్థినే ఎందుకు ముఖ్యమంత్రిని చేస్తారు.  శివసేన ఎలా ఆలోచించింది.  


ఒకవేళ మద్దతు ఇచ్చినా.. శివసేన ఇప్పటి వరకు హిందుత్వ భావజాలం ఉన్న పార్టీగా ఉన్నది.  ఈ సమయంలో సడెన్ గా ముస్లిం భావజాలాన్ని ఒంటపట్టించుకోదు.  ఇది బీజేపీకి కలిసి వస్తుంది. అంతేకాదు, ఒకవేళ మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఏదో ఒకరోజు... ఇతర పార్టీల్లోని కర్ణాటకలో మాదిరిగా ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ అవుతారు. దీంతో ప్రభుత్వం కూలిపోవాల్సి వస్తుంది.  


ఇవన్నీ ఆలోచించిన కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని పక్కన పెట్టింది. మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది.  దీంతో ఎన్సీపీ కూడా మద్దతు ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుంది.  అయితే, ఇప్పుడు కొత్త  వార్తలు బయటకు వస్తున్నాయి. మహా ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ స్థానంలో నితిన్ గడ్కారీ రాబోతున్నారని, నితిన్ ను ముఖ్యమంత్రిగా చేసే ఆలోచనలు కేంద్రం చేస్తోందని అంటున్నారు.  ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం త్వరలోనే తేలిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: