అబ్దుల్లాపూర్ మెట్  తహసిల్దార్ విజయారెడ్డి హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. అందరు  ఉండగానే మిట్టమధ్యాహ్నం సమయంలో  సురేష్ అనే వ్యక్తి  తహసిల్దార్ ఆఫీస్లోకి  చొరపడి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే మంటలతో బయటకు వచ్చిన తహసిల్దారు విజయా రెడ్డిని  కాపాడేందుకు ప్రయత్నించిన మిగతా ఉద్యోగులకు కూడా తీవ్ర గాయాలవ్వగా  తహసిల్దార్ విజయారెడ్డి అక్కడికక్కడే సజీవ దహనం అయిపోయిందే. అయితే తహసిల్దార్ విజయారెడ్డి ని  హత్య చేసిన నిందితుడు  సురేష్ ఆ తర్వాత పోలీసు స్టేషన్ కు  వెళ్లి లొంగిపోయాడు . విజయారెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పంటించిన అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు నిందితుడు సురేష్ . దీంతో నిందితుడు సురేష్ కి కూడా తీవ్ర గాయాలయ్యాయి.కాగా  పోలీసు రక్షణ మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు సురేష్ .కాగా అబ్దుల్లాపూర్ మెట్  తహసిల్దార్ విజయ రెడ్డి హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. 



 వనస్థలిపురం ఏసీబీ సారథ్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం తహసీల్దార్ విజయారెడ్డి  హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసింది. కాగా  ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తులో  మరికొన్ని కీలక విషయాలు వెలుగు చూసాయి . అయితే అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ విజయ రెడ్డి ని నిందితుడు సురేష్ మొదట ఆమె ఇంటి వద్ద చంపాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హత్యకు రెండు రోజుల ముందు ఓ మధ్యవర్తి తో కలిసి తహసిల్దార్ విజయారెడ్డి  ఇంటికి వెళ్ళాడు సురేష్. విజయారెడ్డి ఇంట్లో ఆమె భర్తని కలిసినట్లు సమాచారం. అయితే విజయారెడ్డి భర్తను నిందితుడు సురేష్ ఎందుకు కలిశాడు... విజయ రెడ్డి భర్తతో నిందితుడు సురేష్ ఏం మాట్లాడాడు  అన్న దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. 



 అంతేకాకుండా తహసిల్దార్ విజయారెడ్డి ఇంటికి వెళ్లే ముందు సురేష్ తన స్నేహితులకు ఫోన్ చేసి ఈ రోజుతో తాడోపేడో తెలిపోతుంది అని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితుడు సురేష్ మాటలను బట్టి చూస్తే అతడు ఇంటికి వద్దే విజయరెడ్డిని  హత్య చేయాలని ముందుగానే పథకం పన్నినట్లు తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారట. ఇంటి దగ్గరే తహసిల్దార్ విజయ రెడ్డిని  హత్య చేయాలనుకున్న  సురేష్ తహసిల్దార్ కార్యాలయంలో ఎందుకు హత్య చేశాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అబ్దుల్లాపూర్ మెట్  తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ విజయారెడ్డి ఆఫీస్ లోకి వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన తర్వాత... తీవ్రగాయాలతో రోడ్డు మీదికి వచ్చిన నిందితుడు సురేష్ రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రాంతాలలో ఓ కారులో ఉన్న  వ్యక్తులతో  మాట్లాడినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దీంతో ఆ కారులో ఉన్నది ఎవరు.? నిందితుడు సురేష్ కార్ లోని వ్యక్తులతో ఏం  మాట్లాడాడు అనే దానిపై పోలీసులు కూపీ లాగితే పనిలో పడ్డారు .


మరింత సమాచారం తెలుసుకోండి: