బంగారం మళ్ళి తగ్గింది. ఈసారి తగ్గుదలను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్య పోతున్నారు. ఎందుకంటే అంత రేటు తగ్గింది. భారీగా తగ్గిన ఈ బంగారం ధరలు రోజుకు ఒకలా ఉంటాయి. ఒకసారి తగ్గితే మరోసారి పెరుగుతుంటాయి. ఇలా దీపావళి పండుగా రోజు బంగారం ధర భారీగా పెరగగా ఇప్పుడు మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు కూడా బంగారం ధర తగ్గిపోయింది. 

                    

నేడు గురువారం హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 400 రూపాయిలు తగ్గి 39,900 రూపాయలకు చేరింది. దీనికి కారణం బంగారంపై డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ కొనసాగడం లాంటి వాటి వల్ల బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. కాగా ఈ నేపథ్యంలోనే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 360 రూపాయిలు తగ్గి 36,580 రూపాయలకు చేరింది. బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. 

                  

దీంతో కేజీ వెండి ధర రూ.48,500కు దిగొచ్చి ప్రస్తుతం అందరిని షాక్ కి గురి చేస్తుంది. అయితే ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధర ఇదే బాట పట్టింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అక్కడ కూడా 400 తగ్గింది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్నం మార్కెట్ లో కూడా కొనసాగుతున్నాయి. అయితే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, జువెలరీ మార్కెట్, వాణిజ్య యుద్ధాలు వంటి చాల అంశాలు బంగారంపై ప్రభావం చూపుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: