సమాజంలో అవినీతి అనేది ఓ చీడలా తయారైయింది. మనిషి పడుతున్న బాధలతో సంబంధం లేకుండా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఏదైన పని జరగాలంటే ముందుగా చెల్లించ వలసింది లంచం. ప్రభుత్వంలోని పెద్దలు లంచం ఇచ్చినా, లంచం తీసుకున్నా నేరమే అనే అమలుకాని ప్రకటనలు ఎన్నో గుప్పించారు. కాని లంచం తీసుకున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారా అంటే లేదనే చెప్పవచ్చూ. ఒక సామాన్యుడికి అత్యవసరమైన పని జరగాలంటే రోజులతరబడి తాను చేసేపని వదిలేసి తిరగడం సాధ్యం అవుతుందా ఇలాంటి పరిస్దితుల్లో నీతిగా సక్రమంగా పనిచేసే అధికారులుంటే లంచం అనే మాట ఎందుకు వినిపిస్తుంది.


ఇప్పుడున్న పరిస్దితుల్లో సమాజంలో సగటు మనిషి నేర్చుకునేది అవినీతితో బ్రతకడం, అన్యాయంగా సంపాదించడం. ఇలా ఎందరో ప్రభుత్వ అధికారులు, ఉన్నతమైన స్దానంలో ఉన్నవారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వారిలో తాజాగా ఏఎస్సై, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉన్నారు. వీరి నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం, ఏపీతోపాటు హైదరాబాద్, బెంగళూరులో నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. గుణ్ణం వీరవెంకట సత్యనారాయణ చౌదరి అనే ఈయన ఏఎస్సైగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోర్టు పోలీస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను భారీగా ఆస్తులు కూడపెట్టినట్లు సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు ఆయన బంధువుల నివాసాల్లో తనిఖీలు నిర్వహించారు.


అదేసమయంలో కాకినాడ, సామర్లకోట, యానాం, గండేపల్లి, అరట్లకట్టలో ఏఎస్పీ బృందం సోదాలు నిర్వహించిగా లభ్యమైన ఆస్తుల విలువ రూ.3 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేసినా మార్కెట్‌ విలువ ప్రకారం రూ.10 నుంచి 20 కోట్ల వరకూ ఉంటుందని భావిస్తున్నారు. ఇకపోతే ఏఎస్సై సత్యనారాయణచౌదరిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను రిమాండుకు తరలించారు. ఇకమరో అవినీతి తిమింగళం బాలసాని మురళీగౌడ్‌. ఇతను విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ, విజయవాడ పటమట పోస్టల్‌ కాలనీలోని శ్రీ రామప్రసూన అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు.


ఇక ఇతని ఇంట్లో నెల్లూరు డీఎస్పీ దేవానంద్‌ నేతృత్వంలో సోదాలు నిర్వహించగా, హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు, విజయవాడలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఇక డీఎస్పీ దేవానంద్‌ తెలిపిన వివరాల ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.1,38,75,000 గా ఉంటుందని.. తిరుపతిలోని టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌ శారద, బిల్ కలెక్టర్ శ్రీనివాస్ నివాసాల నుంచి మురళీగౌడ్‌కు చెందిన రూ.13లక్షలు, రూ.2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ సీఐ విజయశేఖర్‌ మీడియాకు వెల్లడించారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: