రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా  విద్యార్థులకు అందజేసే ప్రతిభా పురస్కార అవార్డులు ఈసారి  అన్ని విధాల వివాదాస్పదం మారిపోతుంది. టిడిపి ప్రభుత్వం ఈ పథకానికి డాక్టర్ ఏపీజే  అబ్దుల్ కలాం పేరు పెట్టగా 3 రోజుల క్రితం  జగన్ ప్రభుత్వం ఈ పేరును వైయస్సార్ పురస్కారంగా  మార్చినట్లు జీవో రావడం జరిగింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో  ముఖ్యమంత్రి జగన్  పేరునే కలాం పేరునే ఈ పథకానికి కొనసాగించాలని నిర్ణయించడంతో వివాదం కొంత ముగిసింది అనే చెప్పాలి. ఇప్పుడు తాజాగా ఈ పథకం పరిధినుండి ప్రైవేటు విద్యార్థులను మినహాయించడం మరో వివాదానికి మలుపు తిప్పింది.


ఇంతకుముందు ఈ ప్రతిభా పురస్కారాలను ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారితో పాటు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివి అధిక మార్కులు తెచ్చుకునే విద్యార్థులకు ఇవ్వడం జరిగేది. అయితే ఈసారి జగన్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థులను మినహాయించ  కేవలం ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికి ప్రతిభ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపైన ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అమ్మ ఒడి పథకాన్ని ప్రైవేటు విద్యాసంస్థలకికూడా వర్తింప చేస్తానన్న జగన్ ప్రభుత్వం ప్రతిభా పురస్కారాల నుండి వారిని ఎందుకు మినహాయించింది అని విద్యావేత్తలు ప్రశ్నించడం మొదలు పెట్టారు.


ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివేవారు ప్రతిభావంతులు కాదా వారు పురస్కారానికి అనర్హులాఅని వారు నిలదీస్తున్నారు. అయితే తమకు మాత్రం ప్రభుత్వం నుండి అందిన ఆదేశాల మేరకు ఈ పురస్కారాలకు జిల్లాలో కేవలం 335 మంది ప్రభుత్వ స్కూల్ విద్యార్థులని మాత్రం ఎంపిక చేసినట్లు ప్రకాశం జిల్లా డి ఇ.ఒ సుబ్బారావు వివరణ ఇచ్చారు. ఈ పథకానికి ఎంపికైన పథకానికి ఎంపికైన విద్యార్థుల జాబితాను  డి ఈ ఓ వెబ్ సైట్ లో పెట్టామని పరిశీలించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. ఆగస్టు 11వ తేదీన ఈ పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని వివరించడం జరుగుతుంది అని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: