తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు..ప్రస్తుతం అతని పరిస్థితి చాలా దారుణంగా మారింది. వెంటిలేటర్ పై అతనికి చికిత్స అందిస్తున్నారు..శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా ఉందని వైద్యులు తెలిపారు. తహసీల్దార్ అయిన విజయారెడ్డిని పెట్రోల్ పోసి దారుణంగా సజీవ దహనం చేసిన నిందితుడు సురేష్, అదే సమయంలో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అనంతరం ఆ నిప్పుతోనే సమీపంలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కాలిన గాయాలతో లొంగిపోయాడు. 

        

అప్పటికే సురేష్ సరిరాంకి 60 శాతం గాయాలు అవ్వగా, ఆ సురేష్‌ను పోలీసులు అక్కడికి దగ్గర్ లో ఉన్న ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో ఉస్మానియాలో చికిత్స అందుకున్నారని సురేష్   డాక్టర్లు వెల్లడించారు. అయితే సురేష్  నుంచి పోలీసులు ఇప్పటికే వాంగ్మూలం తీసుకున్నారు. 

           

అయితే కొంతకాలంగా భూపట్టా కోసం తహశీల్దార్ విజయరెడ్డి చుట్టూ తిరిగానని, ఆమె సహకరించకపోవడంతో ఈ పని చేసినట్లు చెప్పాడు. విజయారెడ్డి చేసిన అన్యాయం వల్ల తమ కుటుంబం రోడ్డున పడిందని, అందుకే ఆమెపై కక్ష పెంచుకుని సజీవదహనం చేసినట్లు వాంగ్మూలంలో తెలిపాడు. అయితే అందులో అతను ఇచ్చిన వాంగ్మూలంలో ఏ మాత్రం నిజం లేదని కుటుంబసభ్యులు తెలుపుతున్నారు. 

          

ఒకవేల  సురేష్ మృతి చెందితే నిజానిజాలు ఇక బయటకు రావు అని, ఆ హత్య వెనుక ఉన్న రాజకీయ నాయకులు ఇంకా బయటకు రావని, సురేష్ మరణంతో విజయారెడ్డి హత్యకేసు అంతమవుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. కాగా విజయారెడ్డిని కాపాడే క్రమంలో ఆమె కారు డ్రైవర్ గుర్నాథం తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దీంతో అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: