కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అమలులోకి తీసుకొని వస్తుంది. నిరుద్యోగులు, ఆడపిల్లలు, మహిళలు ఇలా వివిధ రంగాలకు చేందిన వారి కోసం పలు స్కీమ్స్ అమలులోకి తీసుకొని రాబోతుంది. గర్భిణీలకు కూడా ఒక పథకం అందుబాటులో వస్తుంది. దీని పేరు ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన (PMMVY).


మాతృ వందన పథకం కింద అర్హులైన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.5,000 అందించబోతుంది. గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులకు ఈ పథకానికి అర్హులు. తల్లి, బిడ్డ ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. తొలి బిడ్డకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని తెలిపుతున్నారు. గర్భిణి స్త్రీలు అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ రంగం కంపెనీల్లో రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్ పొందుతున్న వారికి ఈ స్కీమ్ నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. తొలి సంతనానికి మాత్రమే స్కీమ్ ప్రయోజనాలు లభిస్తాయి అని కేంద్ర ప్రభుత్వం  వెల్లడిస్తుంది.


ఇక  పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రధాన్ మంత్రి మాతృ వందన పథకం కింద వచ్చే రూ.5,000 మూడు విడతల్లో అర్హులకు చేరుతుంది. అంగన్‌వాడీ సెంటర్ లేదా అప్రూవ్డ్ హెల్త్ ఫెసిలిటీ వద్ద ప్రెగ్జెన్సీ రిజిస్టర్ చేయించుకుంటే తొలి విడత కింద రూ.1,000 వస్తాయి. రెండో విడత కింద రూ.2,000 డబ్బులు వస్తాయి. ప్రెగ్జెన్సీ వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ డబ్బులు పొందవచ్చు అని తెలిపింది.


ఇక చివరి విడత రూ.2,000 డబ్బులు బిడ్డ పుట్టిన తర్వాత కూడా లభిస్తాయి. ఇక్కడ బిడ్డకు బీసీజీ, ఓపీవీ, డీపీటీ, హెపటైటిస్ బి వంటి ఇంజెక్షన్లు వేయించ వలసి ఉంటుంది. ఆ తర్వాతనే ఈ డబ్బులు పొందే అవకాశం ఉంది. చివరి రుతుక్రమం (ఎల్ఎంపీ) వచ్చిన దగ్గరి నుంచి 150 రోజుల్లోగా అంగన్‌వాడీలకు వెళ్లి స్కీమ్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ (ఎంసీపీ) కార్డుపై ఎల్ఎంపీ నమోదు కూడా కచ్చితంగా చేసుకోవాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: