అగ్రిగోల్డ్ వారిని నమ్మి నట్టేట మునిగిపోయాం అనుకుని కన్నీరు కార్చని అగ్రిగోల్డ్ బాధితుడు లేడు. కట్టిన డబ్బులు తిరిగిరావని మధనపడి మరణించినవారు కూడా ఉన్నారు. ఇకపోతే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని మాట ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ కార్యరూపం దాలుస్తోంది. దగాపడ్డ అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. ఈ ఐదేళ్ల పోరాటంలో అడుగడుగునా ఎన్నోకష్టాలు, ఎన్నో అవమానాలు భరించిన వారికి తగ్గ ప్రతిఫలం జగన్ గారు అందించనున్నారు.


ఇకపోతే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే  జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. ఆ తీర్మానాన్ని నిజం చేస్తూ మొదటి బడ్జెట్‌లోనే బాధితుల కోసం 1,150 కోట్ల రూపాయలను కేటాయిస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకుంది వైసీపీ ప్రభుత్వం. అదీగాకుండా 10వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గత నెల అక్టోబర్‌ 18వ తేదీన 263.99 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిషోర్‌ కుమార్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.


అంతేకాకుండా ఇరవై వేల రూపాయల లోపు ఉన్న మరో 4లక్షలమంది డిపాజిట్‌దారులకు కూడా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను గట్టెక్కించడానికి.. నేనున్నానంటూ ఆనాడు ప్రతిపక్షనేతగా వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసా నేడు బాధితులకు అండగా నిలుస్తోందని వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇకపోతే అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇవాళ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకు గాను గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా అందజేస్తారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: