ఇసుక కొరత సమస్య తెలంగాణాలో కూడా మొదలైంది. మొన్నటి వరకూ అవసరాలకు తెలంగాణాలో ఇసుక బాగానే అందింది. అయితే ఇసుక నిల్వలు అయిపోవటంతో తెలంగాణాలో కూడా సమస్య మొదలైంది.  క్షేత్రస్ధాయిలో జరిగిన విషయాలు చూస్తే ఏపిలో ఇసుక కొరత పాపం చంద్రబాబునాయుడుదే అన్న విషయం అర్ధమవుతోంది.

 

నిజానికి వర్షాలు, వరదలు, ఇసుక కొరత రెండు రాష్ట్రాల్లోనూ సమానంగానే ఉంది. కాకపోతే తెలంగాణాలో గడచిన మూడు నెలలుగా ఎక్కడ ఇసుక కొరత ఇబ్బంది పెట్టలేదు. ఎందుకనంటే ప్రభుత్వం ముందుజాగ్రత్తగా ఇసుకను రీచుల నుండి తరలించి స్టాక్ పాయింట్లలో భారీగా నిల్వ చేయించింది.

 

వర్షాలను, వరదలను ముందుగానే గ్రహించిన తెలంగాణా ప్రభుత్వం ఏప్రిల్ , మే నెలలోనే రీచుల నుండి ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించి నిల్వ చేసింది. రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదల వల్ల తెలంగాణాలో కూడా ఇసుకను తవ్వటం సాధ్యంకాక  వదిలేశారు. కాకపోతే అంతకుముందే స్టాక్ పాయింట్లలోని ఇసుకను గడచిన నాలుగు నెలలుగా సరఫరా చేస్తోంది. 

 

అయితే స్టాక పాయింట్లలోని ఇసుక నిల్వలు అయిపోవచ్చాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కొరత పెరిగిపోయింది. మరి తెలంగాణాలో ప్రభుత్వం చేసిన పనిని ఏపిలో చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు ? ఏప్రిల్, మే నెలల్లో చంద్రబాబే కదా సిఎం. ముందుచూపుతో చంద్రబాబు కూడా ఇసుకను స్టాక్ పాయింట్లకు తరలించి ఉంటే ఏపిలో కూడా ఇంతగా ఇసుక కొరత ఉండేది కాదు కదా ? 

 

తెలంగాణాలో ఇసుక సరఫరా విషయాన్ని చంద్రబాబు, ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా తరచూ ఉదహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తెలంగాణాలో ప్రభుత్వం ముందుగా స్టాక్ పాయింట్లలో ఇసుకను స్టాక్ చేసుకున్న విషయాన్ని మాత్రం మాట్లాడటం లేదు.  వర్షాలు, వరద తగ్గితే కానీ ఇసుకను తీయలేమని తాజాగా  తెలంగాణా మైనింగ్ శాఖ ఎండి మల్సూరు చేసిన ప్రకటనతో చంద్రబాబు, ప్రతిపక్షాలకు బుద్ధివస్తుందా ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: