అగ్రిగోల్డ్‌ బాధితులకు కాస్తంత ఊర కలిగింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన మాట ప్రకారం తొలివిడత చెక్కుల పంపిణీ జరిగింది. . ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరగింది. దీంతో అగ్రిగోల్డ్ బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది.  


అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాటం ఫలించింది. బాధితుల కన్నీళ్లను తుడుస్తామన్న జగన్‌ హామీ కార్యరూపం దాల్చింది. తొలి విడతలో మూడున్నర లక్షల మందికిపైగా బాధితులకు చెక్కులు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జగన్ చేతుల మీదుగా ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.  


ఎన్నికల సమయంలోనే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని హామి ఇచ్చిన వైసీపీ... అధికారంలోకి వచ్చిన వెంటనే దృష్టిపెట్టింది. తొలి క్యాబినెట్‌ భేటీలోనే అగ్రిగోల్డ్‌ సమస్యపై నిర్ణయం తీసుకుంది.  బడ్జెట్‌లో 11 వందల 50 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగానే గతనెల రూ.18న 263 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 10వేల లోపు డిపాజిట్‌దారులకు చెక్కులు అందాయి.  


చిన్న, మద్యతరగతి వర్గాలను ఆకర్షించిన అగ్రిగోల్డ్ సంస్థ నిబంధనలకు విరుద్దంగా వారి నుంచి 6,380 కోట్ల రూపాయలను సేకరించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. అయితే తమ సొమ్ము తిరిగి రాదని గ్రహించిన అగ్రిగోల్డ్ బాధితులు.. న్యాయం కోసం గత ఐదేళ్లుగా పోరాటం చేశారు. హైకోర్ట్ అదేశాల‌తో అగ్రిగోల్డ్ యాజ‌మాన్యం ఆస్తుల‌ను అమ్మి.. దాని ద్వారా వ‌చ్చిన నిధుల‌ను అగ్రిగోల్డ్ భాధితుల‌కు ఇవ్వాల‌ని ఆదేశించింది. అది కూడా కార్యరూపం దాల్చలేదు. చివరకు కొత్త ప్రభుత్వం వచ్చాక... ఎన్నికల హామీని జగన్‌ ఇప్పుడు అమలు చేశారు. దీంతో  అగ్రిగోల్డ్ బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: