వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగ బాధితులు కర్నూలు జిల్లా నందికొట్కూరులో అడ్డుకున్నారు. అటుగా వెళ్తున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయిని అడ్డగించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు, నీటిముంపు నిరుద్యోగ బాధితుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారికీ ఎలా అయినా సరే న్యాయం చెయ్యాలని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ని నీటిముంపు నిరుద్యోగ బాధితులు కోరుకున్నారు.  

                           

దీంతో బాధితుల పట్ల సానుకూలంగా స్పందించిన అనిల్ కుమార్ యాదవ్ న్యాయం చేస్తానని మంత్రి హామీ హామీ ఇచ్చాడు. దీంతో ముంపు బాధితులు ఆందోళన అపి మంత్రి అనిల్ కుమార్ కాన్వాయ్ కి దారి వదిలారు. అయితే గత 60 రోజుల నుంచి తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని అందుకె ఇలా కాన్వాయ్ కి అడ్డు పడ్డామని వారు తెలిపారు. 

                                 

శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారిని దర్శించుకొని కర్నూలులో జరుగుతున్న జిల్లా సమావేశానికి వెళ్తుండగా ఈ ముంపు భాదితులు అడ్డు పడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టులో తాము సర్వస్వం కోల్పోయామని 40 ఏళ్లనుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని, గత ప్రభుత్వం ఎలాంటి సహాయసహకారాలు అందించలేదని, మీ ప్రభుత్వమైనా తమకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందించారు. 

                                 

మరింత సమాచారం తెలుసుకోండి: