ఈ మధ్య కాలం లో యువకుల ఆత్మహత్యలు రోజు రోజుకి పెరుగుపోతున్నాయి.చాల చిన్న చిన్న విషయాలకీ పెద్ద ఎత్తున ఆవేశాన్ని  తెచ్చుకొని ఆలోచన లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు .ఇక అస్సలు విషయానికి వస్తే బుధవారం నాచారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది .అస్సలు ఏం జరిగిందంటే  పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని ఓ యువకుడి ప్రాణాలు కాపాడిన సంఘటన  బుధవారం చోటు చేసుకుంది.

పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  లోకేష్‌ అనే వ్యక్తి మల్లాపూర్‌ కెఎల్‌రెడ్డినగర్‌లో ఉంటు ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి  సరిత అనే యువతితో మూడు నెలల క్రితం వివాహం జరిగింది. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికిలోనైన లోకేష్‌ ఆత్మహత్య చేసుకోవాలని  నిర్ణయించుకున్నాడు.


ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తాను ఉంటున్న నివాసంలోని  మూడో అంతస్తు పైకి ఎక్కి సెప్టిక్‌ ట్యాంక్‌ పైప్‌ పట్టుకుని కిందకు దూకేందుకు ప్రయత్నించాడు.దీన్ని చుసిన స్థానికులు ఆశ్యర్యానికి లోనయ్యారు  వెంటనే తమ వంతు చాల సమయాస్పరీతితో సహాయం చేయదలచి ,అక్కడ దగరలో వున్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫామ్ చేయాలనీ  స్థానికులు డయల్‌–100కు ఫోన్ చేసి దీనిని గుర్తించి సమాచారం ఇచ్చారు.

దీన్ని తెలుసుకున్న పోలీస్ వారు  వెంటనే స్పందించి,అతి తక్కువ టైం లోనే   మల్లాపూర్‌ ఏరియా పెట్రోలింగ్‌ సిబ్బంది రాములు, బాలనర్సింహలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు లోకేష్ వున్నా చోటుకి చేరుకున్నారు,పోలీసులు లోకేష్ మనసు మార్చడానికి అతనిని ఆత్మహత్య ప్రయత్నం నుండి బయటపడేయడానికి చాల ప్రయత్నించారు . ఈ  విధంగా లోకేష్ చెప్పుకుంటూ వచ్చారు ,లోకేష్‌కు న్యాయం చేస్తామని అతడికి నచ్చజెప్పారు. తాడు సహాయంతో అతడిని పైకి లాగి ప్రాణాలు కాపాడారు. సకాలంలో స్పందించిన పోలీసులను సీఐ మహేష్‌కుమార్, పోలీస్‌ ఉన్నతాధికారులు అభినందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: