గొంగిడి సునీత మహేందర్ రెడ్డి  గత 20 సంవత్సరాల క్రితం రాజకీయాలలోకి ప్రవేశించి, యాదగిరిగుట్ట ఎం.పి.టి.సి.గా ఎన్నికయి అటుతర్వాత యాదగిరిగుట్ట ఎం.పి.పి.గా పనిచేసింది. 2006 నుండి 2011 వరకు యాదగిరిగుట్ట  మండల పరిధి లోని వంగపల్లి గ్రామానికి కి సర్పంచ్ గా పనిచేసింది.

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలు కు కూడా వెళ్లిన ఈమె 2014  తెలంగాణ రాష్ట్రము అవతరణ జరిగిన అనంతరం  తెరాస పార్టీ  తరపున ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన  బూడిద భిక్షమయ్య గౌడ్ పై 34వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వ విప్ పదవిని దక్కించుకుంది.

  అలాగే గత సంవత్సరం జరిగిన ఎన్నికలలో  మరోసారి అదే నియోజకవర్గం నుండి గెలుపొంది మరోసారి ప్రభుత్వ విప్ పదవిని దక్కించుకుంది. ఈ రోజు  ప్రభుత్వ విప్ గా అసెంబ్లీ ఆవరణలో చార్జీ తీసుకున్న ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారిని సీఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస  పార్టీ లో మహిళలకు ఉత్తమమైన స్థానాన్ని కల్పిస్తున్నామని మంత్రులుగా, విప్ లుగా కొనసాగుతున్నారని ముందు ముందు కూడా వారికీ అగ్రతాంబూలం అందిస్తాం అని ప్రకటించారు.

అలాగే  ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారిని ఆశీర్వదించిన కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, 12 మంది మంత్రులు హరీష్ రావు గారు, జగదీష్ రెడ్డి గారు, ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఎర్రబెల్లి దయాకరరావు గారు, మహమూద్ అలీ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్యే లు గ్యాదరి కిషోర్ గారు, శానంపూడి సైదిరెడ్డి గారు, భాస్కర్ రావు గారు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, Ex భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాల నుండి 1000 మంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతామహేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: