వైసీపీ ప్రభుత్వం తనపై కక్షతోనే దివాకర్ ట్రావెల్ బస్సులు సీజ్ చేస్తున్నారని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులిచ్చినా 15 బస్సులను ఆర్టీఐ అధికారుల ఆధీనంలోనే ఉంచుకున్నారని జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యాకు. దివాకర్ ట్రావెల్స్ లో పర్మిట్ లేని ఒక్క బస్సునైనా చూపిస్తారా అని సవాల్ విసిరారు. కక్షసాధింపులో భాగంగానే నా ట్రావెల్ బస్సులు సీజ్ చేస్తున్నారని జేసీ ఆరోపించారు. ఇప్పటి వరకు 80 బస్సులు సీజ్ చేశారని, బస్సు టైంకు రాలేదని సీజ్ చేస్తున్నారని మండిపడ్డారు.

 


ట్రావెల్స్ సీజ్ చేయడం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులే కట్టాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తమ ట్రావెల్స్ పై కేసులు వేస్తున్న ఆర్టీఓ అధికారి వరప్రసాద్ పై కేసు వేస్తున్ననని ఈ సందర్భంగా జేసీ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ కొందర్ని టార్గెట్ చేస్తున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొందర్ని మానసికంగా, ఆర్థికంగా శిక్షిస్తున్నారని అన్నారు. ఏపీలో హద్దుమీరి పాలన జరుగుతోందని మండిపడ్డారు. చింతమనేనిపై రోజుకో కేసు పెడతారా? అని ప్రశ్నించారు.  రెండ్రోజుల్లో నా మైనింగ్ మూసివేతకు కూడా ఉత్తర్వులు సిద్ధం చేస్తున్నారని సంచలన ప్రకటన కూడా చేశారు. సీఎం చెప్పినట్లు వినకపోతే సీఎస్‍కే బదిలీ తప్పలేదు.. ఇక అధికారులెంత అని ఎద్దేవా చేశారు.  

 


వైసీపీలో చేరితే కేసులుండవని ఒత్తిడి చేస్తున్నారని జేసీ అన్నారు. వైసీపీలోకి రమ్మని ఇప్పటికే తనను ఓ పెద్దమనిషి ఆహ్వానించారనీ.. కానీ రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ఇంతకముందే చెప్పానని ఆయనకు స్పష్టం చేశానన్నారు. ఏ ముఖ్యమంత్రీ అధికారులను అన్నా అని పిలవరని కానీ జగన్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ తరహా విధానం ఎక్కడా చూడలేదని జేసీ వాపోయారు. న్యాయం జరిగేంత వరకూ పోరాడతానని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: